Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మేదర సంఘం నూతన కార్యవర్గం

మేదర సంఘం నూతన కార్యవర్గం

మేదర సంఘం నూతన కార్యవర్గం

న్యూస్ తెలుగు/వినుకొండ :  (మేదరి) సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి విచ్చేసిన కార్యవర్గ సభ్యులతో,అనుబంధ కమిటీలతో,మేదరి సంఘ ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర (మేదరి) అధ్యక్షులుగా, జొరిగె.మస్తాన్ రావు, ప్రధానకార్యదర్శిగా పోలేపల్లి.నాగేంద్ర, కోశాధికారిగా సిరిగిరి మంగారావు, ప్రచారకార్యదర్శిగా పిల్లి.మాణిక్యాలరావు, ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు అనేక అనుబంధ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం ముఖ్యనాయకులు, ఆంధ్రప్రదేశ్ మేదరి సంఘం ముఖ్య నాయకులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు జొరిగె మస్తాన్ రావు మాట్లాడుతూ. అన్ని రాష్ట్రాలలో మా యొక్క కులం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహాయించి ఎస్సీ,ఎస్టీల్లో, ఉన్నది కావునా, ప్రస్తుత ప్రభుత్వం మమ్మల్ని ఎస్టిలో చేర్చవలసిందిగా డిమాండ్ చేశారు. మాకు బ్యాంబు సొసైటీలు మరుగున పడినవి కావున మాకు మరలా సొసైటీలు ఏర్పాటు చేయవలసిందిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరారు. మేము వెదురుతో తయారు చేసే వస్తువులతో గిట్టుబాటు ధరలు లేక మా కులం వారు రకరకాల వృత్తు లలోకి వెళ్లి,చాలీచాలని వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతు మేదర్లు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్లాస్టిక్ పరికరాలు ఎంతో అందంగా తయారవడం మూలాన మా వస్తువులు ఎవరు కొనడం లేదు, గిట్టుబాటు ధరలు కూడా రావడం లేదు,పైగా మూలిగే నక్కా మీద తాటికాయపడిన చందంగా
ప్లాస్టిక్ వస్తువులపై ప్రజలు మక్కువ చూపటం వలన మా వస్తువులు ఎవరు కొనడం లేదు, ప్రస్తుత ప్రభుత్వమైన మా బాధలు అర్థం చేసుకొని మాకు పరిష్కారం మార్గం చూపాలని కోరారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గతంలో ఎన్నికల హామీలలో భాగంగా మా యొక్క కులాన్ని ఎస్సి లో చేరుస్తామని తెలియజేయడం జరిగింది. కావునా,మా స్థితిగతులు అర్థం చేసుకుని ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ యొక్క కులాన్ని ఎస్టిలో చేర్చాలని, సబ్సిడీపై మాకు ఎదురు సప్లై చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, ఏల్లాలుబాబు, డి.ఏసుబాబు, ఎన్.హనుమాన్ ప్రసాద్ , జొరిగె.శ్రీనివాస రావు, కె. వెంకట్ రాముడు తదితరులు పాల్గొన్నారు.(Story : మేదర సంఘం నూతన కార్యవర్గం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!