బనకచెర్ల పథకం ప్రమాదకరమే!
రైతు నాయకుల ఆవేదన
పోలవరం-బనకచెర్ల పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి
నదుల అనుసంధాన ఆవశ్యకత సదస్సులో రైతు సంఘాల నేతలు
న్యూస్‌తెలుగు/విజయవాడ: పోలవరం – బనకచెర్ల పథకంపై చర్చించి, గోదావరి నది వరద జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, బచావత్ ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించిన కృష్ణా నది జలాల హక్కులను పరిరక్షించుకోవడానికి, నిత్యకరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నదీ జలాల తరలింపు ద్వారా శాశ్వత పరిష్కారం చేయడానికి వీలుగా సహేతుకమైన నిర్ణయాన్ని, విజ్ఞతతో తీసుకోవడానికి రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, జలవనరులు, నీటి పారుదల ప్రాజెక్టుల సమస్యలపై అధ్యయనం, ఉద్యమాలు చేస్తున్న సామాజిక ఉద్యమకారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సత్వరం సమావేశాన్ని నిర్వహించాలని, సీపీఐ ప్రముఖ నేత, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు 5వ వర్థంతి సభలో ప్రసంగించిన వక్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
“నదుల అనుసంధానం అవశ్యకత – ప్రతిపాదనలు – సానుకూల, ప్రతికూలాంశాలు” అన్న అంశంపై ఈ రోజు విజయవాడలో కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం, సమన్వయకర్త టి. లక్ష్మీనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. సభలో విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఇందుకూరి సత్యనారాయణ రాజు(ఐఎస్ఎన్ రాజు), విశ్రాంత ఇ.ఇ. కంభంపాటి పాపారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు, మాజీ లోక్ సభ సభ్యులు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాధ్రీశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నేత వై.కేశవరావు, తదితరులు ప్రసంగించారు. నవ్యాంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్రాసిన ఉత్తరాన్ని అసోసియేషన్ అధ్యక్షులు తమ అభిప్రాయంగా పంపారు. విశ్రాంత ఇంజనీర్ కె.బి. గంగాధర్‌రావు వ్రాత పూర్వకంగా పంపిన అభిప్రాయాలను సభకు హాజరైన వారికి అందజేయడం జరిగింది.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రెండు తెలుగు రాష్ట్రాల నీటి సమస్యపై ఒకవైపు విచారణ, ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తూ 2013లో ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో పోలవరం – బనకచెర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించడం ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నదని వక్తలు తీవ్రంగా విమర్శించారు. పోలవరం బనకచెర్ల పథకాన్ని ఉపసంహరించుకుని, గోదావరి – కృష్ణా – పెన్నా అనుసంధానం పథకాన్ని, పోలవరం – సోమశిల అనుసంధాన పథకంగా నిర్మించాలి. గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కాకుండా ప్రత్యేక వరద కాలువ ద్వారా గరిష్ట స్థాయిలో తరలించి, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి మరియు ఎడమ కాలువల ఆయకట్టు, వెలిగొండ, సోమశిల ఆయకట్టుకు గరిష్ఠంగా వినియోగించుకోవాలి. తద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ మీద బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు చేర్చి, తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్టులకు అందించాలి. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు 19 టీఎంసీ కృష్ణా నికరజాలాల కేటాయింపు ఉన్నది. తెలుగు గంగకు 25 టీఎంసీలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం తెలుగు గంగ, గాలేరు – నగరి మరియు వెలిగొండ, హంద్రీ – నీవా, కల్వకుర్తి, నెట్టంపాడుకు చట్టబద్ధత వచ్చింది. వాటికి కృష్ణా జలాలను కేటాయించాల్సిన బాధ్యత విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ పై ఉన్నది. రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యపై విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ వ్యతిరేక తీర్పు ఇస్తే, దాన్ని అవకాశంగా మలచుకొని ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కృష్ణా నికర జలాలలో ఎక్కువ వాటాను డిమాండ్ చేసే ప్రమాదం ముంచుకొస్తుంది ఆందోళన వ్యక్తం చేశారు.
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి విస్పష్టమైన ప్రకటన చేయాలని, పోలవరం జలాశయం గర్భం 32 – 35 మీటర్ల మధ్య నీటిని తరలించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకాన్ని తక్షణం రద్దు చేయాలని, రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి, నిధులను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని, వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు రానున్న వర్ష కాలం దృష్ట్యా వెంటనే మరమ్మత్తులు చేయాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“నదుల అనుసంధానం అవశ్యకత – ప్రతిపాదనలు – సానుకూల, ప్రతికూలాంశాలు” అన్న అంశంపై బుధవారం విజయవాడలో కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం, సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన సభ జరిగింది. సభలో విశ్రాంత చీఫ్ ఇంజనీర్ ఇందుకూరి సత్యనారాయణ రాజు(ఐఎస్ఎన్ రాజు), విశ్రాంత ఇ.ఇ. కంభంపాటి పాపారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు, మాజీ లోక్ సభ సభ్యులు మరియు రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాధ్రీశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ , ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నేత వై. కేశవరావు, తదితరులు ప్రసంగించారు. ఐఏఎస్ విశ్రాంత అధికారి బి. శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కె.వి.వి. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అధ్యక్షుడు వి. కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నేత కొలనుకొండ శివాజీ, నీటి సంఘాల అధ్యక్షులు ఆళ్ళ వెంకటగోపాల కృష్ణ, సీపీఐ (ఎంఎల్) నాయకుడు హరినాథ్, కిషోర్, వీరబాబు, తోట ఆంజనేయులు, ప్రొ. సి. నరసింహారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ ఎన్. లక్ష్మణరావు, వరదయ్య, దివికుమార్, చిగురుపాటి భాస్కర్ రావు, తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో సభలో పాల్గొన్నారు. (Story: బనకచెర్ల పథకం ప్రమాదకరమే!)
Follow the Stories:
యూనియన్ బ్యాంకులో ఉద్యోగాల జాతర
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)