శ్యామలాంబ అమ్మవారి పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి
న్యూస్ తెలుగు/సాలూరు : శ్యామలాంబ అమ్మవారి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, దీనికి ప్రజలు సహకరించాలని సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి సినిమా తిరిగే ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఏటువంటి అవంతారా లురాకుండా సినిమాను ఊరేగింపు కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని అన్నారు సాలూరు పట్టణ పరిధిలో 5 ప్రాంతాలను గుర్తించి పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈనెల 18వ తారీకు నుంచి పట్టణంలోకి ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్, టూ వీలర్స్ అనుమతి నిరాకరించడం జరుగుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ వాహనాలకు అనుమతించడం జరుగుతుందని అన్నారు.సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. పండుగ సజావుగా జరగడానికి కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. (Story:శ్యామలాంబ అమ్మవారి పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి)

