Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తొలి ఏకాదశి కి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి

తొలి ఏకాదశి కి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి

0

తొలి ఏకాదశి కి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి

 అధికారులతో సమీక్షించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని తొలి ఏకాదశి పండుగ లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. దేవాలయం,ఘాట్ రోడ్డు, గిరిప్రదర్శన రోడ్డు నిర్మాణంపై బుధవారం చీఫ్ విప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 7వ తేదీ జరగబోవు తొలి ఏకాదశి పండుగ భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి 5.90 కోట్లు, గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణానికి 1.20 కోట్లు, రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి 2 కోట్లు నిధులు మంజూరు చేయించానని, అలాగే దాతల సహకారంతో 6 నెలల్లో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను చీఫ్ విప్ జీవి ఆదేశించారు. ఘాట్ రోడ్డు నిర్మాణం గతంలో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా ఇష్టానుసారంగా ఘాట్ రోడ్డుకు బ్లాస్టింగ్లు చేయటం వలన కొండచిట్టు రాళ్లు నిలిచి ప్రమాద భరితంగా మారిందన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఎటువంటి లోపాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని నాణ్యత ప్రమాణాలతో దేవాలయం, గిరి ప్రదర్శన రోడ్డు, ఘాట్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. రోడ్లు, ఆర్టీసీ బస్సు పార్కింగ్, గ్రీనరీ, కరెంటు, త్రాగునీరు తదితర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించి భక్తుల మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆదేశించారు. రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి వినుకొండ ప్రజల సహాయ సహకారాలు అందించాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి త్వరలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కొండపై మెట్ల మూర్గాన్ని కూడా దాతల సహకారంతో త్వరితగతిన పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, జనసేన, బిజెపి నాయకులు, పంచాయతీరాజ్ ఎస్.ఈ బ్రహ్మయ్య, ద్వామా పిడి సిద్ధ లింగమూర్తి, ఆర్ అండ్ బి, పిఆర్, పి ఐ యు, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ డి ఈ లు, ఏఈలు, దేవాదాయ శాఖ డీఈ, ఏఈ లు, ఈవోలు, ఫారెస్ట్, రెవిన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, వార్డు కౌనిసిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.(Story :తొలి ఏకాదశి కి ఘాట్ రోడ్డు పూర్తి చేయాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version