సివిల్స్ అభ్యర్థులకు 30 నెలల ఉచిత శిక్షణ ఆదివారం ప్రవేశ పరీక్ష
న్యూస్ తెలుగు/వినుకొండ : అన్నమాట ప్రకారం సివిల్స్ కోచింగ్ స్కాలర్‌షిప్ అందించే విషయంలో ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక ప్రకటన చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు అందరికీ ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించి… ప్రతిభ ఆధారంగా 30 నెలలపాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. డా. లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఈ సందర్బంగా బుధవారం జీవి మీడియాతో మాట్లాడుతూ. పూర్తి వివరాలు వెల్లడించారు. వినుకొండలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ,బీసీ మహిళా అభ్యర్థుల్లో ప్రతిభ ఉన్నవారిని 10మందిని ఎంపిక చేసి శివశక్తి ఫౌండేషన తరఫున ఉచితంగా శిక్షణ ఇప్పిం చడం జరుగుతుందన్నారు. వారికి వసతి, భోజనం సహా అన్ని ఏర్పాట్లు ఉచితంగానే చేస్తామ న్నారు. ఆదివారం అందుకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడిచారు. వినుకొండ పట్టణం కురిచేడు రోడ్డులోని సీతారామపురం ఐనవోలు దగ్గర ఉన్న డా. లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనంలో ఆ పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారంతా ఆదివారం పరీక్షకు హాజరు కావొచ్చని తెలిపారు. పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారికి సివిల్స్, గ్రూప్ పరీక్షలకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8639379369 అనే నంబర్‌లో సంప్రదించాలని లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు తెలిపారు.(Story : సివిల్స్ అభ్యర్థులకు 30 నెలల ఉచిత శిక్షణ ఆదివారం ప్రవేశ పరీక్ష )