మహిళ హత్య కేసులో నిందితులని అరెస్ట్ చేయాలి మాజీ ఎమ్మెల్యే బొల్లా డిమాండ్
న్యూస్ తెలుగు/వినుకొండ : గత ఏడాది మే 17వ తేదీన వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో చింతల దేవి వివాహిత మహిళ గేదెలు కాసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనలో నేటికీ నిందితులను అరెస్ట్ చేయలేదని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లా మాట్లాడుతూ. మహిళ హత్యపై వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు డిజిపి కు లేఖలు వ్రాశామని తెలిపారు. ఈ సంఘటన జరిగి 11 మాసాలు గడిచిన కేసు పురోగతి ఏమాత్రం కనిపించలేదు అన్నారు. సంఘటన అనంతరం పలుమార్లు స్పందనలో మృతురాలి భర్త చింతల శ్రీనివాసరావు ఇద్దరు పిల్లలు తాము వెళ్లి అధికారులకు వివరించి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన కనపడలేదని బొల్లా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో 174 కేసు ఫైల్ చేసినట్లు అనుమానాస్పద మృతి అని రాయటం దారుణం అన్నారు. ఫారెన్సీక్ రిపోర్టులో మహిళ మెడ లోపల ఎముక విరిగి కళ్ళల్లో నుండి రక్తం కారినట్లు రిపోర్టు ఉంటే అనుమానాస్పద మృతి ఎలా అంటారని బొల్లా విమర్శించారు. మహిళ హత్య జరిగి 11 మాసాలు దాటిన ఎవరిని ఇంతవరకు అరెస్టు చెయ్యకపోవడం ఏనుగుపాలెం గ్రామంలో ప్రజలు బిక్కిబిక్కుమంటున్నారని ఆయన అన్నారు. ఈ కేసును ఎందుకు తొక్కి పెడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. తాను నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ప్రతిపక్ష నేతగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రి కి లెటర్లు రాయడం జరిగింది అన్నారు. అలాగే ఈ సంఘటనపై ఎమ్మెల్యే క్యాబినెట్ హోదా కలిగిన చిఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఎందుకు స్పందించడం లేదని బొల్లా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మృతరాలి భర్తను కొందరు బెదిరిస్తున్నారని, 10 ప్రజా దర్బార్లు జరిగిన ఈ మహిళ హత్య కేసు ఎందుకు తేల్చరని బొల్లా ప్రశ్నించారు. రాష్ట్రం లో ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే నిందితుల తాటతీస్తాం అని ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ఈ సంఘటనపై ఎందుకు స్పందించరని బొల్లా ప్రశ్నించారు. నిందితుల్ని అరెస్టు చేసి, మృతురాలి భర్త ఇరువురు పిల్లలకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని బొల్లా అన్నారు. ఈ సమావేశంలో. వైసీపీ అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, దేవరాజ్, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పి. వెంకటరామిరెడ్డి, బేతం గాబ్రియేలు, తదితరులు పాల్గొన్నారు.(Story :మహిళ హత్య కేసులో నిందితులని అరెస్ట్ చేయాలి మాజీ ఎమ్మెల్యే బొల్లా డిమాండ్ )