రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు
న్యూస్ తెలుగు/వనపర్తి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తప్పవని ఎమ్మెల్యే అధికారులకుసూచించారుబుధవారంపెద్దమందడి,మండలంమణిగిల్లజగత్పల్లి,అల్వాలదొడగుంటపల్లిచిన్నమందడి,వీరా యపల్లి, జంగమయ్యపల్లి గ్రామాలలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. తేమశాతం వచ్చిన అందరి రైతులతో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని గన్ని బ్యాగుల ఇబ్బందులు లేకుండా, కొలతలల్లో తేడా లేకుండా, ధాన్యం విక్రయించగా వచ్చిన మొత్తాలను సకాలంలో అన్నదాతల ఖాతాల్లో వేసేందుకు కావలసిన పత్రాల సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని, ధాన్య సేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, పెద్దమందడి సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు వెంకటస్వామి, రమేష్ గౌడ్, మాజీ సర్పంచులు, రమేష్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, బాల్ చంద్రయ్య, సాక వెంకటయ్య, మాజీ ఎంపీటీసీలు రామచంద్రయ్య గౌడ్, సత్యరెడ్డి, దొడగుంటపల్లి మాజీ ఎంపీటీసీ సాయి భార్గవి రాజశేఖర్, అమ్మపల్లి వెంకటేశ్వర రెడ్డి, గట్టు యాదవ్, బాలు, వెంకటయ్య, వెంకటేశ్వర్ రెడ్డి సుదర్శన్, రాకాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు )