అభివృద్ధి చేసింది మనం…..మళ్ళీ అభివృద్ధి కొనసాగించేది మనమే
చారిత్రాత్మక రజతోత్సవ సభకు రావడం మన బాధ్యత
వనపర్తి పట్టణ,మండల రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం(పట్టణ,మండల) నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్3 వలన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని చిన్న రాష్ట్రల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యం అని అనాడు అంబేద్కర్ ప్రతిపాదించడం కారణం అని అన్నారు.వార్డుల నుండి గ్రామాలనుండి ఒక ప్రభంజనంలాగా,పండుగలా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగి ఉన్నారని వారికి అండగా నిలవడం నాయకుల బాధ్యత అని అన్నారు. రజతోత్సవ సన్నాహక సమావేశం కోసం తరలివచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు.పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలకు అన్ని మండలాలో అనూహ్య స్పందన లభించిందని ఈ ఉత్సాహం స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,గంధం.పరంజ్యోతి,ఆవుల. రమేష్,మాణిక్యం, కురుమూర్తి యాదవ్,విజయ్ కుమార్,నందిమల్ల.అశోక్,బుజాల.వెంకటేశ్వర్ రెడ్డి ,బండారు.కృష్ణ, నాగన్న యాదవ్, కంచె.రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి,గులాం ఖాదర్ ఖాన్,జోహెబ్ హుస్సేన్,ఇమ్రాన్,సయ్యద్.జమీల్,ముద్దుసార్, ఎం.డి.గౌస్ సూర్యవంశం.గిరి,మండల నాయకులు రఘువర్ధన్ రెడ్డి,భాను ప్రకాశ్ రావు,రవిప్రకాష్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,శ్యాం,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.(Story : అభివృద్ధి చేసింది మనం…..మళ్ళీ అభివృద్ధి కొనసాగించేది మనమే. )