గోమాతల పేరుతో వైకాపా, జగన్, భూమన నీచ రాజకీయాలు
వైకాపా శవ రాజకీయాల్లో గోమాతల్ని కూడా వదలక పోవడం విచారకరం: జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : శవ రాజకీయాలకు పెట్టింది పేరైన వైకాపాలో జగన్, భూమన చివరకు గోమాతలను కూడా వదలక పోవడం దారుణమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన తండ్రి శవంతో పార్టీ పెట్టి, బాబాయి శవంతో అధికారంలోకి వచ్చింది మొదలు ఎక్కడ ఏ ప్రేతం దొరుకుతుందా అనే ఎంతసేపూ వారి వెదుకులాటగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు . తితిదే గోశాలలో ఆవుల సహజ మరణాలను కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకోవాలన్న వారి తప్పుడు ప్రచారాలు కూడా అందులో భాగమేనని మండి పడ్డారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వైకాపా, జగన్, భూమన తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. అసలు వైకాపా, జగన్‌కు హిందూ ఆలయాలపై ఎందుకింత కక్షో అర్థం కావడం లేదన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో 100కు పైగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని, 2023లో లడ్డూకల్తీతో తిరుమలను అపఖ్యాతి పాలు చేసింది ఇంకా ఎవరూ మరిచిపోలేదన్నారు. ఇప్పుడు 100 ఆవులు చనిపోయాయంటున్న వారి అబద్దాలకు తితిదే రికార్డులే నిజం చెబుతాయన్నారు. ఎక్కడివో ఫేక్ ఫోటోలు తెచ్చి, భక్తుల్లో అలజడి రేపడమే ఈ కుట్ర లక్ష్యంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు స్వామివారి ఉనికినే ప్రశ్నించిన నాస్తికుడైన భూమనకు టిటిడీ గురించి మాట్లాడే నైతిక అర్హతఉందో లేదో కూడా ఒక్కసారి ఆలోంచుకోవాలన్నారు. 2 దఫాలు తితిదే ఛైర్మన్‌గా ప్లాస్మా టీవీల కుంభకోణం, తాలిబొట్ల వెంకటేశ్వర కుంభకోణం, డాలర్ కుంభకోణంతో పాటు కాంట్రాక్టుల్లో అక్రమాలతో వందల కోట్లు కొల్లగొట్టారని, సాధారణ భక్తుల కన్నీళ్లు లెక్కచేయకుండా దర్శన టికెట్లు, స్వామివారి ప్రసాదాల్ని అమ్ముకున్న ఘనుడు భూమన అన్నారు . అవిగాక టీటీడీని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని పన్నిన కుట్రలు, ఆలయ స్వామిని “నల్లరాయి అన్నవాడు, 7కొండలను 5కొండలకు కుదించాలని చూసి నవాడు, అడ్డదారుల్లో పదవిభూముల్ని సన్నిహితులకు లీజుకు ఇచ్చి జేబులు నింపుకోవడం వంటి భూమన దుర్మార్గాల లెక్కలూ తేల్చుతున్నామన్నారు. వైకాపా, జగన్, భూమన తిరుమల విషయంలో చేసిన పాపాలకు స్వామివారి ఎదుట శిక్షలు అనుభవించక తప్పదని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. తిరుమల లో ప్రవేశించేందుకు డిక్లరేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా హిందు ధర్మాన్నే ప్రశ్నించిన జగన్ తీరుని కూడా ప్రజలు ఎవరూ మరిచిపోలేదని అందరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. (Story : గోమాతల పేరుతో వైకాపా, జగన్, భూమన నీచ రాజకీయాలు)