గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పి 50 రూ పెంచుతారా ?
పుల్లల కర్రలే శరణ్యం
కరెంట్ ఛార్జీలు పెంచారు..
నిత్యావసర ధరలు పెంచారు…
మందుల ధరలు పెంచారు…..
పెట్రోల్ ధరలు పెంచారు…
ఇంటి పన్నులు పెంచారు
బతకాలా! వద్దా
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
గ్యాస్ సిలిండర్ పెంపు పై
సీపీఐ నిరసన
న్యూస్ తెలుగు/చింతూరు : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,ఇంటి పన్ను, కరెంట్ బిల్లు తోపాటు వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక మదర్ తెరిసా సెంటర్ వద్ద గంట పాటు నిరసన నిర్వహించారు.
అంతకుముందు కొత్తకాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం, డైరీ ఫారం రోడ్, ఏల్చూరి పాపారావు ఇల్లు మీదుగా మదర్ థెరిసా బొమ్మ వద్దకు చేరుకుని అక్కడ గంట సేపు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ అటు మోడీ, ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని ఆయన విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్బాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక బారాలు మోపుతారా అని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ చార్జీలు, మందుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆస్తి పన్ను పెంపు, నిత్యవసర వస్తువుల ధరల పెంపు విపరీతంగా పెంచారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాదుడే బాధడంటూ ఆందోళనకు దిగారని ఆయన విమర్శించారు. పాలకుల విధానాలు కు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు
సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి కే.బోడకొండ, తోకల ప్రసాదులు మాట్లాడుతూ గ్యాస్ బండ పెంపుతో పాటు పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజల సతమతం అవుతున్నారని, ఆస్తు విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గుతున్న ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటు అని వారు విమర్శించారు. వెంటనే ఎక్సైజ్ సుంకం రద్దు చేయాలని వారు కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్
ఏ భవాని, సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, టి.అన్నవరం, ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర, ఏఐటీయూసీ నాయకులు రామయ్య, అనిల్, మహిళా సమైక్య నాయకురాలు కుమారి, గంగా, అప్పయ్యమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story : గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పి 50 రూ పెంచుతారా ?)