పర్యావరణ పరిరక్షణ ప్రచారం లో మజ్జిగ పంపిణి
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు లోని ఐ టి డి ఎ ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ అధ్యాపకులు, మన్యం కవి నూనె రమేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రం లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవల్సిన చర్యలను గురించి నూనె రమేష్ వివరించారు. ఐ టి డి ఎ కి విచ్చేసిన వివిధ మండలాల ప్రజలకు ఉపశమనం కోసం చల్లని మజ్జిగ పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో పర్యావరణ హితం కొరకు ప్లాస్టక్ నిర్ములన చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ పర్యావరణానికి సమాజానికి కలుగ జేస్తున్న ప్రమాదాలను వివరిస్తూ ప్లాస్టిక్ పెనుభూతంగా తయ్యారయ్యిందన్నారు. ప్లాస్టిక్ పర్యావరణ కాలుష్యం,సముద్ర జీవులకు హాని పశువులకు ముప్పు, ఆరోగ్య సమస్యలు
వ్యర్థ నిర్వహణ సమస్య,భూమి ఉర్వరత తగ్గింపు వంటి ఇబ్బందులను కలిగిస్తుందాన్నారు.
ప్లాస్టిక్‌కు బదులుగా జూట్, కాగితం, ఇలాంటివి వాడాలన్నారు.పునర్వినియోగ చేయగల ప్లాస్టిక్ మాత్రమే ఉపయోగించి ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేదించాలన్నారు. ఈ కార్యక్రమం లో డిగ్రీ కళాశాల అధ్యాపకులు కట్టా శైలజ, గూడెం హారతి, విద్యార్థులు వేముల చిరంజీవి, గణేష్, మురళి దుర్గ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. (Story: పర్యావరణ పరిరక్షణ ప్రచారం లో మజ్జిగ పంపిణి)