సాలూరు లో జగ్జీవన్ రామ్ జయంతి
న్యూస్ తెలుగు/ సాలూరు : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి” సందర్భంగా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన గౌరవ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి ఆయన కృషి ఎనలేనిదని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వరప్రసాద్ రావు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు . (Story : సాలూరు లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి)