చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహణ
న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాజనీతి శాస్త్రం విభాగాధిపతి అప్పనమ్మ అధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం, ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినీ , విద్యార్థులను ఉద్ధ్యేశించి మాట్లాడుతూ బిహార్ రాష్ట్రం లోని భోజ్ పూర్ జిల్లాలోని చంద్వా గ్రామం లో1908 ఏప్రియల్ 5 వ తేదీన దళిత కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ భారత దేశానికి ఉప ప్రధాని గా పని చేశారని బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమారి ఈ దేశానికి లోక్ సభ స్పీకర్ గా పని చేసిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కుటుంబ సభ్యులకు కలదని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న .సబ్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పుష్పాలంకరణ చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు, అధ్యాపకెతర సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి యస్. అప్పనమ్మ విద్యార్థిని, విద్యార్థులను ఉద్ధ్యేశించి మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొట్ట మొదటి భారతీయ కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపారు. కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం మరియు విద్యార్థిని విద్యార్థులు బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని స్మరిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్.వై.పద్మ,కె.శ్రీదేవి, కె.శ్రీలక్ష్మి, కె.శకుంతల, కె.శైలజ,జి.హరతి,యన్.రమేష్, నాగ రామ్మోహన్ రావు తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ ,విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహణ)