ప్రముఖ చిత్రకారుడు వజ్రగిరి జెస్టిస్ కు దక్కిన అరుదైన గౌరవం
న్యూస్ తెలుగు /వినుకొండ : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ హైదరాబాద్ లో జెస్టిస్ చిత్రించిన చాకలి ఐలమ్మ 6×4 అడుగుల వర్ణచిత్రం, హైదరాబాద్ కు చెందిన డాక్టర్ బి.సంధ్య విప్లోవ్ వ్రాసిన ఇరవై ఇంగ్లీష్ కవితలు జెస్టిస్ బ్రష్ తో చిత్రించారు. ఎంతో గొప్పగా గీసిన ఈ చిత్రం శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ దర్బార్ హాల్లో శాశ్వతంగా కొలువుతీరింది. ఈ చిత్ర ఆవిష్కరణా కార్యక్రమానికి ప్రముఖ నటుడు, సినీ దర్శకులు బి.నరసింగరావు, ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, డాక్టర్ సంధ్య, విప్లోవ్, డాక్టర్ హరి, తెలంగాణ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్రకారుడు వజ్రగిరి జెస్టిస్ ను ఎంతగానో అభినందించారు. ఈ సందర్భంగా ఎన్నో అవార్డులు కంటే ఈ చిత్రం ద్వారా పొందిన అభినందనలు, యూనివర్సిటీ లో చిత్రానికి లభించిన స్థానం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని జెస్టిస్ తెలిపారు. ఈ సందర్భంగా వినుకొండ ప్రముఖులు తోటి కళాకారులు జెస్టిస్ ను ఎంతగానో అభినందించారు. వినుకొండ ప్రతిభను తెలంగాణ రాష్ట్రంలో కూడా నిలిపి నందుకు ప్రత్యేకంగా ప్రశంసించారు. (Story : ప్రముఖ చిత్రకారుడు వజ్రగిరి జెస్టిస్ కు దక్కిన అరుదైన గౌరవం)