ఇద్దరి మధ్య గొడవను రెడ్‌బుక్ రాజ్యాంగమని ఎలా అంటారు?
మాజీ ఎమ్మెల్యే మక్కెన
బ్రహ్మనాయుడు, వైకాపా నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఎక్కడో తిరునాళ్లలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ, అనంతర పరిణామాలను రెడ్‌బుక్ రాజ్యాంగం , రాజకీయ పరమైన దాడులు ఎలా అంటారంటూ బొల్లా బ్రహ్మనాయుడు వైకాపాను తెలుగుదదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు ప్రశ్నించారు. మేళ్లవాగు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గుమ్మనంపాడుకు చెందిన ఒక ముస్లిం వ్యక్తి, సాంబిరెడ్డి అనే ఇద్దరి మధ్య వివాదం జరిగిన మాట వాస్తవం అని, ఆ కారణంగా తర్వాత ఇరువర్గాల మధ్య తగవులు జరిగాయని.. దానిని పట్టుకుని బొల్లా తప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్య్ బొల్లా బ్రహ్మనాయుడు ప్రచారంపై బుధవారం ఈ మేరకు స్థానిక నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. మక్కెన. వైకాపా యూత్ పార్టీ నాయకులు అయిన సాంబిరెడ్డి, అతడి బృందం గురించి ఊరిలో ఎవర్ని అడిగినా చెబుతారని, ఆ నిజాలన్నీ దాచి బొల్లా రాజకీయపరమైన లబ్దికోసం లేని విషయాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన స్వల్ప వ్యవధిలోనే చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో స్థానికంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే చూసి ఓర్చుకోలకనే ఇలా… వైకాపాకు అలవాటైన తప్పుడు ప్రచారాన్ని మార్గంగా ఎంచుకున్నట్లు కనిస్తోందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి ఇన్చార్జ్ లెనిన్ కుమార్, పెమ్మసాని నాగేశ్వరరావు,బారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.(Story : ఇద్దరి మధ్య గొడవను రెడ్‌బుక్ రాజ్యాంగమని ఎలా అంటారు? )