బి సిలకు 42 % రిజర్వేషన్ అమలు చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : బి సిలకు జనాభా దామాషా ప్రకారం 42 % రిజర్వేషన్ స్థానిక సంస్థలలో , విద్యా ఉద్యోగ , ఉపాధి అవకాశాలలో అమలు చేయాలని పార్లమెంటులో చట్టం చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెన్న రాములు డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆదివాసి,అగ్రకులాల పేదలకు సంబంధించిన పేద రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పంట పొలాల్లోనే చెట్లకు ఉరిపోసుకొని చనిపోతున్నారని కాబట్టి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని వాస్తవంగా వ్యవసాయం చేసే రైతులకు 10 ఎకరాల వరకు రైతుబంధు లేదా రైతు భరోసా ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వారికి , బడా భూస్వాములకు , పెట్టుబడిదారులకు, రైతు భరోసా అవసరం లేదని పేర్కొన్నారు. మహాజన రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు , ప్రధాన కార్యదర్శి సంధ్య పాగా వెంకటేశు , ఎం రామన్ గౌడు మాజీ ఎంపీటీసీ రైతులకు ప్రత్యేకంగా వ్యవసాయ కమిషన్ ద్వారా రైతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆత్మహత్యలకు గురైన రైతు కుటుంబాలకు భీమా సౌకర్యం వెంటనే కల్పించాలని వారి కుటుంబాలకు , పిల్లలకు, రేషన్ కార్డులు , డబుల్ బెడ్ రూములు , సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా మహాజన రైతు నాయకులు డిమాండ్ చేశారు. BCF రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లాడి భగవంతు గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు తాటిచెట్లు , ఈత చెట్లు పెంచుకోడానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . BCF మహబూబ్నగర్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలు ఎస్సీ, ఎస్టీ ఆదివాసి మైనారిటీలు ,అగ్రకులాల పేదలు నిరుపేదలుగా మారిపోయారని ఈ దేశ వనరులు వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నారని , కాబట్టి ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసి మైనారిటీలకు అగ్రకుల పేదలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు కే వెంకటేశ్వర్లు, తోట బాలరాజు , బి సి ఎఫ్ యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూగూరు శ్రీనివాస్ సాగర్ , కొత్తకోట మండల బిసిఎఫ్ ఉపాధ్యక్షులు జల్లెండ్ల వెంకటేష్ యాదవ్ , జీవన్ గౌడ్ పాల్గొన్నారు.