ఊర్కొండ పేట ఘటన ఘోరం..
దోషులను ఉరి తీయాలి : NFIW
న్యూస్‌తెలుగు/వనపర్తి : నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ పేట వద్ద గత శనివారం మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘోరమని, దోషులను ఉరితీయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (NFIW) ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన స్నేహితుడితో కలిసి ఒక మహిళ ఉత్సవానికి వెళ్లి వస్తుండగా,ఊర్కొండ పేట వద్ద సుమారు 9 మంది యువకులు తాగి న మత్తులో ఆమె స్నేహితుడిని చెట్టుకు కట్టేసి, కళ్ల ఎదుటే4 గంటలు హింసించి గ్యాంగ్ రేప్ చేశారని, దాహం అని అడిగితే నోట్లో మూత్రం పోసారని ఇది మనుషులు చేసే పనేనా అని ప్రశ్నించారు. ఘటనను ఖండించారు.7గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని,2 తప్పించుకు తిరుగుతున్నారని వారిని కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిందితులకు వెంటనే ఉరిశిక్షలు పడేలా పోలీసులు చూడాలన్నారు. ఇలాంటి వారికి ఉరే సరైన శిక్ష అన్నారు. సమాజంలో బతకటానికి వీరు అనర్హులన్నారు.ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటానికి మద్యంపై ఆధారపడటం సరికాదన్నారు. గ్రామ గ్రామాన సందు సందుకు బెల్ట్ షాపులు నడుపుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం గతంలో బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పారని ఇంతవరకు చర్యలు లేవన్నారు. మందు అందుబాటులో ఉండటంతో తాగి యువకులు, మైనరు పిల్లలు కూడా దారుణాలకు దిగబడుతున్నారన్నారు. వెంటనే బెల్టు షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, మహిళా సమాఖ్య పట్టణకు కన్వీనర్లు, శిరీష, భూమిక, నేతలు శ్రీదేవి, జ్యోతి, అమృత తదితరులు పాల్గొన్నారు.(Story : #Post Excerpt ఊర్కొండ పేట ఘటన ఘోరం.. దోషులను ఉరి తీయాలి : NFIW)