వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మీసాల శ్రీనివాసరావు ఎన్నిక
న్యూస్ తెలుగు/వినుకొండ : గురువారం జరిగిన వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికల లో 103 ఓట్లకు గాను 93 ఓట్లు పోల్ అయ్యాయి.ప్రెసిడెంట్ అభ్యర్ధిగా మీసాల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ పి.వి.రమణ రెడ్డి, సెక్రెటరీ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్, జాయింట్ సెక్రటరీ గా నీలం శేఖర్ బబాబు, ట్రెజరర్ గా వరగాని శివ శంకర్ బాబు ఎన్నికయ్యారు. గెలుపొందిన వారు బార్ అసోసియేషన్ ఐక్యతగా ఉండటానికి మరియు నూతన కోర్టు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. గెలుపొందిన వారికి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అలాగే ఎన్నికల అధికారులుగా కే ఎస్ ఎం యు నాయుడు, గాలి నాగరాజు, డి నాగరాజు వ్యవహరించారు.(Story : వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మీసాల శ్రీనివాసరావు ఎన్నిక )