ఎర్రజెండా పోరాటాలనే పేదలకు అభివృద్ధి సంక్షేమం : విజయరాములు
న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశంలో ఎర్రజెండా పోరాడాలతోనే పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు. గురువారం పెబ్బేర్ పట్టడం మహాజన హమాలి సంఘం భవనంలో సిపిఐ శతజయంతి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిసెంబర్ 26, 1925 లో సిపిఐ ఆవిర్భవించి డిసెంబర్ 26, 2024 న 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రం లో మార్చి 23న శతజయంతిఉత్సవాలు జరుపుతున్నామన్నారు. దున్నేవాడికి భూమి పింఛన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, రుణమాఫీ, తదితర ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు లభించాయన్నారు. కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల గొంతుకలు సిపిఐ చట్టసభల్లో బయట వినిపిస్తోందన్నారు. అధికారం ఉందా లేకపోయినా పేదల అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తుందని, పేదలతో హక్కుల కోసం ఎర్రజెండా పట్టి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, పెబ్బేరు నాయకులు శ్రీనివాసులు, శాంతమూర్తి, జగదీష్, రాములు, వెంకట్, రాజు , మన్యం , గాంధీ , చింతల రాములు, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. (Story : ఎర్రజెండా పోరాటాలనే పేదలకు అభివృద్ధి సంక్షేమం : విజయరాములు)