ప్రభుత్వ పథకాలాన్ని ప్రజలందరికీ చేరేలాగా చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గత పది సంవత్సరాలలో గ్రామాలను ధ్వంసం చేశారని ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయిన కొంకలపల్లి బండరాయిపాకుల నిర్వాసితులకు తాను అండగా ఉండి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. రేవల్లి మండలంలోని బండరాయిపాకుల గ్రామంలో ఐమాక్స్ లైట్ల ప్రారంభోత్సవం మరియు హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని మాట్లాడారు అనంతరం రేవల్లి మండలంలోని కొంకలపల్లి గ్రామంలో ఇండ్ల స్థలాల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు
కొంకలపల్లి ఆర్ అండ్ ఆర్ ఇల్లు నిర్మించుకున్న 331 లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేస్తున్నామని ఇంకా 23 పెండింగ్లో ఉన్నాయన్నారు. గతంలో ఆర్ అండ్ ఆర్ కమిటీలో బయట వ్యక్తులు ఉండేవారని వారిని మార్చి మీ ఇంటి సభ్యులనే కమిటీ మెంబర్లుగా ఉంచామని తెలిపారు. గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు కోటి లక్షల రూపాయలు స్థలమెచ్చిన ప్రజలకు వేశామని తెలిపారు
ఇవే కాకుండా నూతన గ్రామాలలో రోడ్స్ విద్యుత్ పనులు అన్ని ఒక్కొక్కటిగా చేస్తున్నామని తెలిపారు అధికారంలోకి వచ్చిన అనాతి కాలంలోనే రేవల్లి మండలానికి రోడ్ల నిర్మాణం కోసం 14 కోట్ల నిధులు మంజూరు చేశామని వీటితోపాటు రేవెల్లి ఏదుల రోడ్డు మరియు తీగలపల్లి నాగపూర్ రోడ్డు రేవెల్లి ఏదుల రోడ్డు మరియు తీగలపల్లి నాగపూర్ రోడ్డు 31 కోట్లు టెండర్లు కూడా వేసామని తెలిపారు
వచ్చే నెలలో రేవెల్లి మండలానికి తహసిల్దార్ కార్యాలయం నిర్మాణం మొదలు పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిచే ప్రారంభిస్తామని తెలిపారు. గత పదేళ్లలో గ్రామీణ వ్యవస్థను వ్యవస్థను పాలకులు ధ్వంసం చేశారని ఒక్కొక్కటిగా ఇప్పుడు సరి చేస్తున్నామని మీకు న్యాయం చేసే బాధ్యత మీ బిడ్డ ఎమ్మెల్యే దే అని అన్నారు. ఇవే కాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్ సరపర, 500 రూపాయలకే సిలిండర్, అమ్మ ఆదర్శ పాఠశాలలను మహిళలకు 100 ఆర్టీసీ బస్సులు సోలార్ ప్లాంట్స్ వంటి వాటితో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు
. ప్రభుత్వ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే మీ గ్రామానికే ఎంపీడీవో వస్తారని మీ సమస్యలను పరిష్కరిస్తారని ఏవైనా సమస్యలుంటే 15 20 రోజుల్లో పరిష్కరిస్తారని కొంకలపల్లి గ్రామస్తులకు తెలిపారు. ఎవరి మాటలు నమ్మవద్దని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో లక్ష్మీదేవి, ఎంపీడీవో విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మండల ఇన్చార్జ్ సత్య శీలా రెడ్డి, రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ పథకాలాన్ని ప్రజలందరికీ చేరేలాగా చర్యలు తీసుకోవాలి)