కవిత్వంతో లక్షలాది మంది ప్రభావితం అవుతారు
న్యూస్ తెలుగు/వనపర్తి : నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో చిక్కొండ్ర రవి రచించిన ” వీరనాగు”శతకంను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని బుద్దారం గ్రామములో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిక్కొండ్రా రవి చిన్న వయసులో గ్రామీణ ప్రజల జీవన విధానం సామాజిక అసమానతలను,జీవకోటికి ప్రాణమైన నీళ్ళను సాహిత్యంగా తీసుకొని వీరనాగు శతకం రచించడం అభినందనీయం అని అన్నారు. చిన్ననాటి నుండి తాను పెరిగిన పరిస్థితులను గ్రామీణ ప్రజల కష్టాలను క్లుప్తంగా చూస్తూ ఒకనాడు వర్షంపై ఆధారపడే వ్యవసాయాన్ని చూసి చలించిపోయిన నేను అపర భగీరథ ప్రయత్నంతో కృష్ణ జలాలు తీసుకొచ్చిన వైనాన్ని రవి వివరించారని కొనియాడారు.వీరనాగు శతకం సామాజిక శతకంగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సాధారణంగా ఆవిష్కరణలో సాధారణ స్థితిలో జరుగుతాయని కానీ ఈరోజు తాను పుట్టిపెరిగిన గ్రామం ప్రజల మధ్యన ఆవిష్కరించడం అభినందనీయం అని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపట్ల.సుబ్బయ్య,మాదిరే.మల్లమ్మ,డాక్టర్.శిఖామణి,డాక్టర్.కోటేశ్వర రావు,నాగవారం. బాలరాం,రామ్మూర్తి,అమర్నాథ్,వహీద్ ఖాన్, విప్లావ్ తదితరులు పాల్గొన్నారు.(Story : కవిత్వంతో లక్షలాది మంది ప్రభావితం అవుతారు)