ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడలతో విద్యార్థులు, యువతకు ఎంతో మేలు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/ వినుకొండ :కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీలతో రాష్ట్ర మొత్తం విద్యార్థులు, యువతకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రం నుంచి ఒలంపిక్స్, జాతీయస్థాయిలో రాణించేలా యువతకు తీర్చిదిద్దడానికి ఇదెంతో ఎంతో మేలు ఉపయోగకరం అవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు వారివారి నియోజవర్గాల్లో, స్థానికంగా అన్ని ప్రాంతాల్లో క్రీడల ప్రోత్సాహాని కృషి చేయడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్రీడలు దోహదం చేస్తాయన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియ వేదికగా మంగళవారం ప్రారంభమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆటల పోటీల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. సభాపతి అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మహిళా మంత్రులతో కలిసి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయగీతాన్ని ఆలపించారు. అనంతరం జరిగిన టగ్ ఆఫ్ వార్ లో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించారు. తర్వాత మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ పాఠశాల లు, కళాశాలల్లో క్రీడా వ్యాప్తికి ప్రజాప్రతినిధుల క్రీడలు దోహదం చేసే అవకాశం ఉందన్నారు. ప్రాంతాలకు అతీతంగా అందరు కలసికట్టుగా పాల్గొంటున్న ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు స్పీకర్, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధుల క్రీడలు ఎప్పట్నుంచో ఉన్న సంప్రదా యమే అయినా మధ్యలో కొంత విరామం వచ్చిందని…తిరిగి ఆ ఆటల్ని పునరుద్ధరించడం మం చి పరిణామంగా పేర్కొన్నారు. ఏటా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే బావుంటుందన్నారు. (Story : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడలతో విద్యార్థులు, యువతకు ఎంతో మేలు)