శ్రీ ధన్వoతరి నారాయణ హోమం కరపత్రాలు విడుదల
న్యూస్‌తెలుగు/విజయనగరం : సర్వరోగాలను హరించే శ్రీ ధన్వoతరి హోమం మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ (పండు)తెలిపారు. మంగళవారం గ్రూప్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో బొడ్డు పండు మాట్లాడుతూ లోకకళ్యాణార్ధం విశ్వశాంతి కోసం హోమం నిర్వహిస్తున్నట్లు, శ్రీ ధన్వoతరి హోమం లో పాల్గొనడం వలన సమస్త రోగనివారణ కలిగి, ప్రజలు ఆరోగ్యంతో జీవిస్తారని అన్నారు. మార్చి 27 వ తేదీ గురువారం కొత్తపేట శ్రీమన్నార్ రాజగోపాల స్వామి వారి దేవాలయం వద్ద హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 60మంది రుత్వికులు, 162 మంది దంపతులు సమక్షంలో హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సురేష్, రమేష్, గోపాల్, జగదీశ్, కొప్పరపు కృష్ణ, రవ్వా వెంకటేశ్వర్రావు, నారాయణం లక్షణరావు తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రీ ధన్వoతరి నారాయణ హోమం కరపత్రాలు విడుదల )