ప్రత్యేక రాష్ట్రంతో తెలుగువారికి గుర్తింపునిచ్చిన అమరజీవి
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నివాళి
న్యూస్‌తెలుగు/వినుకొండ : మనకంటూ ఒక రాష్ట్రం లేకుండా మద్రాసీలుగా పిలుస్తున్న రోజుల్లో ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించి తెలుగువారికి గుర్తింపునిచ్చిన మహనీయుడు అమరజీవీ పొట్టి శ్రీరాములు అని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తెలుగువారి కోసం రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి లక్ష్యం సాధించారని, భాషాప్రయుక్త రాష్ట్రాలకూ ఆద్యుడి గా నిలిచారన్నారు. అలాంటి వ్యక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం వినుకొండ పాత మార్కెట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, కుల వివక్ష అధికంగా ఉన్న ఆ రోజుల్లో సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన గొప్ప స్వాతంత్య్ర్య సమరయోధుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆశయం కోసం ప్రాణాలు త్యాగం చేసిన భారతదేశ అతి ముఖ్యుల్లో ఒకరుగా నిలిచారంటూ నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు లాంటి అయిదుగురు ఉంటే దేశాన్ని స్వాతంత్ర్యం ఎప్పుడో సాధించేవాడిని అన్న మహాత్మాగాంధీ మాటలే అమరజీవి గొప్పతనానికి నిదర్శమన్నారు. గాంధీ సూచించిన అహింస, ధర్మం. హరిజనో ద్ధరణ, సత్యం కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు నేటి యువతకు ఆదర్శమన్నారు. దేశం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే ప్రతిఒక్కరికీ ఆయనో స్ఫూర్తిదీపమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే అహింసా రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు కాపాడుతూ రాష్ట్రాభివృద్ధి అహర్నశలు శ్రమిస్తున్నారని, అందుకే ప్రజలు చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి జేజేలు ప లుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మున్సిపల్ ఛైర్మన్ డా. దస్తగిరి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయుబ్‌ఖాన్ సహా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.(Story : ప్రత్యేక రాష్ట్రంతో తెలుగువారికి గుర్తింపునిచ్చిన అమరజీవి)