Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైసీపీ పార్టీ పై,ఆ పార్టీ నాయకుల పై యువత పోరు చేయాలి

వైసీపీ పార్టీ పై,ఆ పార్టీ నాయకుల పై యువత పోరు చేయాలి

వైసీపీ పార్టీ పై,ఆ పార్టీ నాయకుల పై యువత పోరు చేయాలి

న్యూస్ తెలుగు / వినుకొండ : గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరల పాటు మోసం చేసి ఓడిపోయి 10 నెలలు గడుస్తున్నా ఇంకా కొత్త కొత్త విధానాలతో మళ్ళీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేయాలని చూస్తుంది అని రాష్ట్ర విద్యార్థి యువజన సంఘం అద్యక్షులు సంపెంగుల రవికుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. 2019 లో మీరు ఇస్తాం అన్న ఫీజ్ రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లు సకలం లో ఇవ్వకుండా ఇస్తాం అనవి కూడా పూర్తిగా ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తాం అని చెప్పి 5 సంవత్సరాల్లో 10 విడతలుకు గాను, 5 విడతలు కొట్టి, మిగతావి అడిగితే, విద్యార్థుల పై అక్రమ కేసులు, కళాశాల యాజమాన్యాలకు కసెన్స్ రద్దు చేస్తాం అని బెదిరించి, పీజీ విద్యార్థులకు GO NO 77 ద్వారా అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, వారిని మోసం చేసి, వేలాది మందిని నిరుద్యోగులుగా, కూలీ లు గా మార్చింది మీరు కదా అని రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకి కడుపు కొట్టింది మీరు కదా, GO NO 117 ద్వారా స్కూల్ మెర్జ్ చేసి ఎన్నో పాఠశాలలు మూసి వేసి ఆ గ్రామాల్లో విద్యార్థులకి విద్యను దూరం చేసింది మీరు కదా, 5 సంవత్సరాలు మోసం చేసి సిగ్గులేకుండా ఇపుడు యువత పోరు అని అనటానికి వైసిపి నాయకులకి సిగ్గు లేదా అని మీ ప్రభుత్వం వునపుడు చివరి 3 నెలల ముందు డి. ఎస్. సి. నోటిఫికేషన్ ఇచ్చి మోసంచేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత డీఎస్సీ ద్వారా 16437 పోస్టులు, ఇచ్చారు ఇది మీకు కనిపించలేదా, మీరు ఆపిన మధ్యన భోజన పథకం తిరిగి అమలు చేశారు. ఇది కనిపించలేదా, మీరు ఇవ్వకుండా ఆపిన ఫీజ్ రీయింబర్స్ మొత్తం ఫీజ్ రీయింబర్స్ మెంట్ కాలేజీలకు జమ చేస్తున్నారు. ఇది మీకు కనిపించలేదా, విద్యార్థులకు మీరు ఇవ్వవలసిన స్కాలర్ షిప్స్ ఇస్తున్నారు. ఇవి మీకు కనిపించలేదా, గడిచిన 5 సంవత్సరాలు విద్యావ్యవస్థను నసనంచేసింది మీరు కదా, మీరు చేసిన విధ్వంసాన్ని తిరిగి గాడిన పెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీకు కూటమి ప్రభుత్వాన్నికి నక్కకు నాగ లోకానికి వున్నంత తేడా వుంది మీరు అధికారం లో వున్నపుడు చేసిన అరాచకాలు మొన్న ఎలక్షనస్ తో చరమగీతం పాడారు. అందుకనే 151 సీట్లు కాస్తా 11 వచ్చాయి, ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ గుర్తు చేశారు. అంటే ఆ 11 కూడా ఈ సారి రావు అని, మీరు పిలుపును ఇస్తున్నప్పుడు గుర్తుంచుకొని ఇవండీ ఏం పులుపునిస్తునమో, ఏమి చేస్తున్నామో అని గుర్తుంచుకొని మాట్లాడండి అని విద్యార్థుల పై యువత పై మాట్లాడే హక్కు వైసీపీ కి లేదని మీరు నాశనం చేసిన విద్యార్థుల, భవిష్యత్తుని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతుంది అని ఇకనైనా మోసం చేయటం మానుకోవాలని లేదంటే ఈ సారి 11 సీట్లు కూడా కష్టమే అని సంపెంగుల అన్నారు. (Story : వైసీపీ పార్టీ పై,ఆ పార్టీ నాయకుల పై యువత పోరు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!