Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విమానాశ్రయాలు వచ్చేస్తున్నాయ్‌!

విమానాశ్రయాలు వచ్చేస్తున్నాయ్‌!

విమానాశ్రయాలు వచ్చేస్తున్నాయ్‌!

అంతర్జాతీయ స్థాయిలో మరో రెండు గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు
శ్రీకాకుళం, అమరావతిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు
భోగాపురం విమానాశ్రయ రహదారుల అభివృద్ధి
చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూస్‌ తెలుగు/అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై శరవేగంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటితోపాటు అభివృద్ధి వికేంద్రరణకు ఆలోచిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ), జాయింట్‌ వెంచర్‌ వంటి విధానాల్లో వీటిని నిర్మించనున్నారు. దానిలో భాగంగా అమరావతి, శ్రీకాకుళం ప్రాంతాల్లో రెండు గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలిచింది. కేంద్రంలోను, ఏపీలోను ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో ఈ రెండు నిర్మాణాలు శరవేగంగా ముందుకు పోయే అవకాశాలున్నాయి. వాటికి అవసరమైన కన్సల్టెన్సీ సంస్థల నియామాకానికిగాను ఆన్‌లైన్‌ టెండర్ల దాఖలుకు మార్చి 21 వరకు గడువు విధించారు. మార్చి 24న సాంకేతిక బిడ్‌లు, 27న ఫైనాన్షియల్‌ బిడ్‌లు తెరుస్తారు. అమరావతి విమానాశ్రయం నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని కన్సల్టెన్సీ సంస్థే సూచించాల్సి ఉంది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం స్థలసేకరణలో నిమగ్నమైంది. అమరావతి రాజధానిపై ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ సమయంలో అక్కడకు ప్రతిష్టాత్మకమైన గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం తీసుకురానుంది.

శ్రీకాకుళంలో సముద్ర తీరంలో ఎయిర్‌పోర్టు

శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరంలో ఎయిర్‌పోర్టును నిర్మించనున్నారు. ఈశాన్య దిశలో శ్రీకాకుళం నగరానికి 70 కి.మీ. దూరంలో, సముద్రతీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలోను కేంద్ర బృందం సభ్యులు మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో భూములను పరిశీలించిన విషయం విదితమే. కన్సల్టెన్సీ సంస్థలపై ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణను ప్రభావితం చేసే సాంకేతిక, ఆర్థిక అంశాలను గుర్తించడం, పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. దానిపై కన్సల్టెన్సీ సంస్థలు వేగవంతంగా దృష్టి పెడితే, కూటమి ప్రభుత్వ ప్రతిపాదనలు ముందుకెళ్తాయి. విమానాశ్రయాల నిర్మాణానికి కాన్సెప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌, ఫైనాన్షియల్‌ మోడల్‌, ప్రాజెక్ట్‌ స్ట్రక్చర్లను రూపొందించాలి. నిర్మాణ వ్యయ అంచనా, రెవెన్యూ జనరేషన్‌ మోడళ్లు, విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్‌ హబ్‌లుగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక అధ్యయనం చేయాల్సి ఉంది. వైమానిక, రక్షణ రంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను కన్సల్టెన్సీ సంస్థలు దృష్టి పెట్టాలి.

పెరగనున్న విమానాశ్రయాలు

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో గన్నరం, తిరుపతి, విశాఖ ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి. వాటి ద్వారా అంతర్జాతీయ విమాన రాకపోకలు వస్తున్నాయి. వాటికి తోడుగా ఈ రెండు గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే, ఏపీకి ప్రయాణాలు సులభతరమవుతాయి. ఈ రెండు పూర్తయితే రాష్ట్రంలో విమానయాన సేవలు మరింత విస్తరిస్తాయి. తద్వారా వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా నిలుస్తుంది. వచ్చే 35 ఏళ్ల ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాల రూపకల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనుంది. ఆయా విమానాశ్రయాలకు అనుగుణంగా రన్‌వేలు, ట్యాక్సీవేలు ఎన్ని ఉండాలి, అవి ఎంత పొడవు, ఎయిర్‌క్రాఫ్ట్‌ పార్కింగ్‌ స్టాండ్లు, ప్యాసింజర్‌, కార్గో టెర్మినళ్ల రూపకల్పన వంటి అంశాలను ప్రణాళికలో పొందుపరుస్తారు. నాన్‌-ఏవియేషన్‌ రెవెన్యూ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. దీంతోపాటు విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి వేగంగా రాకపోకలు ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయానికి జాతీయ రహదారిలో అనుసంధానంగా అనేక రోడ్లను అనుసంధానం చేయనున్నారు. ఈ విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న 18 రహదారుల్లో 11 గ్రీన్ ఫీల్డ్ రహదారులలున్నాయి. తొలి దశలో 12 గ్రీన్ ఫీల్డ్ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. విశాఖ జిల్లా పరిధిలోని 11, విజయనగరం జిల్లా పరిధిలో 6, అనకాపల్లి జిల్లాలో ఒక రహదారి పొడవులను విస్తరించనున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు అధ్వర్యంలో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. (Story: విమానాశ్రయాలు వచ్చేస్తున్నాయ్‌!)

Follow the Stories:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రీక్ష‌!

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!