Homeక్రీడలుజయం మనదే!

జయం మనదే!

జయం మనదే!

ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌
ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా
ఆల్‌రౌండ్‌ ప్రతిభ, సమష్టిపోరుతో విజయం సాధించిన రోహిత్‌సేన

దుబాయ్‌: భారత క్రికెట్‌ జట్టు ఛాంపియన్స్‌గా అవతరించింది. ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారంనాడిక్కడ జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంటు ఫైనల్స్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై అద్భుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా, భారత్‌ ఇంకా 6 బంతులు మిగిలిఉండగానే 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి జయభేరి మోగించింది. రవీంద్ర జడేజా బౌండరీ విన్నింగ్‌ షాట్‌తో భారత్‌ విజయపతాకాన్ని ఎగురవేసింది. ఈ విజయంతో భారత్‌ మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని హస్తగతం చేసుకున్నట్లయింది. వాస్తవానికి పూర్తిస్థాయి తొలి విజయం ఇదేనని చెప్పవచ్చు. 2002లో భారత్‌ తొలిసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. కాకపోతే ఫైనల్స్‌ రద్దు కావడంతో భారత్‌, శ్రీలంక జట్లను ఉమ్మడి ఛాంపియన్లుగా ప్రకటించింది. ఇక 2013లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి భారత్‌ గెలిచి ట్రోఫీని గెలిచినప్పటికీ, వర్షం కారణంగా ఆ ఫైనల్స్‌ను 20 ఓవర్లకు కుదించడంతో అది పూర్తిస్థాయి వన్డే విజయంగా చెప్పలేని లోటుగానే భావించవచ్చు. ఈసారి మాత్రం రోహిత్‌సేన కివీస్‌ను మట్టికరిపించి, ట్రోఫీని చేజిక్కించుకున్నది. ఏదేమైనప్పటికీ, భారత్‌కు ఇది మూడవ ఛాంపియన్స్‌ ట్రోఫీ. ఇక న్యూజిలాండ్‌పై భారత్‌ తీయని ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. 2000వ సంవత్సరంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ 4 వికెట్ల తేడాతోనే ఆనాడు భారత్‌ను ఓడిరచి, ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు ఇదే 4 వికెట్ల తేడాతో భారత్‌ గెలిచి, కివీస్‌పై ప్రతీకారం తీర్చుకుంది.


252 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దాన్ని స్వల్ప స్కోరుగా భావించకుండా, ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. మూడు భారీ సిక్సర్లు, ఐదు ఫోర్లు కొట్టి తన అర్థసెంచరీని చకచకా పూర్తిచేశాడు. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌లు 105 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే వీరి భాగస్వామ్యాన్ని శాంట్నర్‌ విడదీశాడు. శాంట్నర్‌ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ పైకెగిరి పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్‌ అవుటయ్యాడు. గిల్‌ 50 బంతుల్లో ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లీ ఒకే ఒక్క పరుగు చేసి బ్రేస్‌వెల్‌ ఎల్బీకి దొరికిపోయాడు. డీఆర్‌ఎస్‌కు అప్పీలు చేసినా, ఫలితం కివీస్‌కే అనుకూలంగా వచ్చింది. మూడు బంతుల వ్యవధిలో భారత్‌ రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడం టీమిండియాను దెబ్బతీసింది. భారత శిబిరం ఒక్కసారిగా మౌనం దాల్చింది. అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ రావడంతోనే ఒక ఫోర్‌ కొట్టి మళ్లీ అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించాడు. కానీ రోహిత్‌శర్మ వికెట్టును కోల్పోవడం భారత్‌ను ఊహించలేని విధంగా బాధించింది. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో లాథమ్‌ పట్టిన క్యాచ్‌కు రోహిత్‌ నిష్క్రమించాడు. అతను 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌ తోడ్పాటుతో శ్రేయాస్‌ అయ్యర్‌ స్కోరును ముందుకు నడిపించాడు. అతను 62 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేసి శాంట్నర్‌ బౌలింగ్‌లో రవీంద్రకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అతను 2 పరుగుల దూరంలో అర్థసెంచరీ మిస్సయ్యాడు. అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌లు స్కోరును 200 దాటించారు. కాకపోతే 42వ ఓవర్‌లో అక్షర్‌ అవుట్‌తో స్కోరు స్తంభించింది. అతను 40 బంతుల్లో ఒక ఫోరు, ఒక సిక్సర్‌తో 29 పరుగులు చేశాడు. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో రూర్కీకి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఇక రాహుల్‌కు హార్ధిక్‌ పాండ్యా తోడుగా నిలిచాడు. ఇరువురూ ఇన్నింగ్స్‌ను నడిపిస్తూ, విజయానికి కావాల్సిన పరుగులను దాదాపుగా పూర్తిచేశారు. మ్యాచ్‌ సంక్లిష్టంగా మారిన సమయంలో హార్దిక్‌ పాండ్యా ఒక సిక్సర్‌ కొట్టి గెలుపును సులువు చేశాడు. అయితే కొద్దిసేపటికే జామీసన్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్‌ రాహుల్‌ 33 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో 34 పరుగులు, జడేజా 6 బంతుల్లో ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌లు రెండేసి వికెట్లు, జామీసన్‌, రచిన్‌ రవీంద్ర చెరొక వికెట్టు తీసుకున్నారు.

అంతకుముందు, న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. బహుశా భారీ స్కోరు సాధించి, భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలన్న లక్ష్యం ఆ జట్టుకు ఉండవచ్చు. కానీ తొలి 50 పరుగుల పూర్తయ్యేవరకే కివీస్‌ అంచనాలు సరిపోయినట్లు అన్పించాయి. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ కివీస్‌ అంచనాలను తలకిందులు చేసింది. రెండు మూడు క్యాచ్‌లు మిస్సయినా, ఓవరాల్‌గా భారత ఫీల్డర్లు చెమటోడ్చారు. న్యూజిలాండ్‌ ఓపెనర్లు విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్రలు ఉత్సాహపూరితమైన పవర్‌ బ్యాటింగ్‌తో అర్థసెంచరీ భాగస్వామ్యం అందించారు. కాకపోతే వరుణ్‌ చక్రవర్తి ఎల్బీకి యంగ్‌ (15) దొరికిపోవడంతో వారి భాగస్వామ్యానికి బ్రేక్‌ పడిరది. ఆ తర్వాత వచ్చిన కీలక బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ (11) అనూహ్యంగా కుల్‌దీప్‌ యాదవ్‌ గూగ్లీ మాయలో పడి అతనికే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారిపట్టాడు. ఊపుమీదున్న రచిన్‌ రవీంద్ర సైతం కొద్ది సేపటికి కుల్‌దీప్‌ బౌలింగ్‌లోనే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రవీంద్ర 29 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 37 పరుగులు చేశాడు. 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో కివీస్‌ కష్టాల్లో ప‌డింది. పైగా మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ జోరుపై దీని ప్రభావం పడిరది. మిఛెల్‌, లాథమ్‌, ఫిలిప్స్‌, బ్రేస్‌వెల్‌లు ఓ మాదిరిగా ఆడినప్పటికీ, వేగవంతమైన బ్యాటింగ్‌కు స్వస్తిచెప్పాల్సి వచ్చింది. వీళ్లంతా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించారు. లాథమ్‌ (14)ను రవీంద్ర జడేజా ఒక లైన్‌ అండ్‌ లెన్త్‌ బంతికి ఎల్‌బీడబ్ల్యు రూపంలో వెనక్కి పంపించాడు. డారిల్‌ మిఛెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌లు ఐదో వికెట్టుకు 57 పరుగుల భాగస్వామ్యం అందించారు. కానీ ఫిలిప్స్‌ను వరుణ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి, మరోసారి మ్యాచ్‌ను తిప్పాడు. మిఛెల్‌కు బ్రేస్‌వెల్‌ తోడయ్యాడు. వీరిద్దరూ 46 పరుగులు జోడించారు. ఈసారి మిఛెల్‌ షమీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ పట్టిన క్యాచ్‌కు నిష్క్రమించాడు. మిఛెల్‌ 101 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. కివీస్‌ బ్యాట్స్‌మన్లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. బ్రేస్‌వెల్‌ మాత్రం ఆఖరిదాకా ఆడి 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్‌ శాంట్నర్‌ (8)ను కోహ్లీ రనౌట్‌ చేయడం కలిసొచ్చింది. వారు 250 స్కోరు దాటడం కష్టమని అనుకుంటున్న తరుణంలో ఆఖరి రెండు ఓవర్లలో బ్రేస్‌వెల్‌ ఆటతీరుతో కివీస్‌ స్కోరు 251 వరకు చేరింది. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తిలు రెండేసి వికెట్లు, షమీ, జడేజా చెరొక వికెట్టు తీసుకున్నారు. (Story: జయం మనదే!)

Follow the Stories:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రీక్ష‌!

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!