Homeవార్తలుతెలంగాణఆకుకు అదునుదాటుతోంది

ఆకుకు అదునుదాటుతోంది

ఆకుకు అదునుదాటుతోంది

 

– పూర్తికాని తునికాకు టెండర్లు
– నేటికీ మొదలుకాని పూనింగ్ పనులు
– వేసవి పంట కోసం ఎదురు చూపు
– పొరుగు రాష్ట్రాల్లో పూర్తయిన టెండర్లు
– ఫస్ట్ సేల్ మాత్రమే పూర్తి
– ఖరారయ్యేది ఎప్పుడో 

గిరిజనులకు ఆదాయం తెచ్చి పెట్టే రెండో పంట తునికాకు. ఈ వేసవి పంట ద్వారా గిరిజనులు తెల్లవారక ముందే పిల్లా పాపలతో అడవిబాట పదకారు. కాగా ఆ తునికాకు సేకరణకు సంబంధించి నేటికి కూడా టెండర్లు ఖరారు కాలేదు. వాస్తవానికి డిసెంబర్, జనవరి మాసాల్లో ముగియాల్సిన టెండర్లు ప్రక్రియ మార్చి మొదటి వారానికి కూడా పూర్తి కాక పోవడంతో గిరిజనులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కేవలం మొదటి దఫా ఆన్లైన్ టెండర్లు మాత్రమే టెండర్లు మాత్రమే పూర్తి చేసిన టిఎస్ఎఫ్ సీ మిగితా 3 దఫాల పూర్తి చేసే టెండర్లు ఖరారు చేసేది ఎప్పుడని, ఆకుకు అదునుదాటుతోందని కార్మికులు, గిరిజనులు అంటున్నారు.

న్యూస్‌తెలుగు/ భద్రాచలం : తునికాకు సేకరణ గిరిజనులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి తునికాకు సంబంధించిన ఈ ఏడాది ఇంకా టెండర్లు ఖరారు
చేయనేలేదు. వాస్తవానికి డిసెంబర్, జనవరి మాసాల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో గిరిజనులు, కార్మికులు ఆందోళన చెందడంతో పాటు పలు కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో కొమ్మకొడితేనే తప్ప నాణ్యమైన ఆకు రాదని, కొమ్మకొట్టిన 40 రోజుల తర్వాత ఆకు సేకరణ మొదలు పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

 వేసవి పంట కోసం////- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, పాల్వంచ అభయారణ్యం, కొత్తగూడెం డివిజన్లతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని డివిజన్లు కలుపుకుని మొత్తం 36 తునికాకు యూనిట్లు ఉన్నాయి. వీటి మొత్తంగా సుమారు 700 కళ్లాలు ఏర్పాటు చేస్తారు. తునికాకు సేకరణ ద్వారా ఏటా సుమారు 30 వేల మంది కార్మికులు ఉపాది పొందుతుంటారు. వానా కాలం సీజన్లో సాధారణ పంటలు ముగిసి వేసవిలో ఇళ్ల వద్ద ఉండే కార్మికులు, గిరిజనుల చాలా మంది తునికాకు సేకరణ పై ముక్కువ చూపుతుంటారు. ఈ సేకరణ ద్వారా సమకూరే ఆదాయంతో శుభకార్యాలు, బంగారు, వెంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. వేసవి సెలవుల్లోనే ఆకు సేకకరణ ఉండనుందటంతో విద్యార్థులు సైతం ఇళ్లకు చేరుకుని కుటుంబీకులతో పాటు ఆరు సేకరణకు వెళుతుంటారు. దానిద్వారా సమకూరిన ఆదాయంతో బట్టులు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు.

ప్రక్క రాష్ట్రంలో ముగిసిన టెండర్లు///– పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సాల్లో తునికాకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. అక్కడ 50 ఆకుల కట్టకు రూ.3.70 పైసలు గా కూడా నిర్ణయించారు. తెలంగాణలో టెండర్లు దశ ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించకుంటే నాణ్యమైన ఆడు దక్కే అవకాశం లేదని అంతా అంటున్నారు.

మొదటి దశ మాత్రమే పూర్తి////– గత నెల 28వ తేదిన కేవలం మొదటి దశ టెండర్లు మాత్రమే పూర్తి చేశారు. టిఎస్ఎఫ్ డిసి టెండర్లను ఆన్లైన్ ద్వారా పిలుస్తుంది. మొత్తం నాలుగు దేశాల్లో ఈ ఆన్లైన్ టెండర్ల ప్రక్రియను ముగించి ఎక్కువ కోడ్ చేసిన వారికి తునికాకు కాంట్రాక్టులు అప్పగిస్తారు. మరో మూడు దశల టెండర్లు పూర్తయ్యేది, ఆకు పూనింగ్ పనులు చేసేది, ఆ ఆకు కోసేది ఎప్పుడో అంటూ గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఇంకా ఆలస్యమైతే ఆకులో నాణ్యత ఉండదని, తద్వారా రేటు పలికే అవకాశు సన్నగిల్లుతుందని అంటున్నారు.

పూర్తిగాని గత ఏడాది టార్గెడ్//// గత ఏడాది తునికాకు సేకరణకు గానూ నిర్ణయించిన టార్గెట్ చేరుకోవడంలో అటవీశాఖ చతికలపడింది. 32300 స్టాండర్డ్ బ్యాగుల టార్గెట్ నిర్ణయించగా కేవలం 13437 బ్యాంగులను మాత్రమే సేకరించ గలిగారు. కేవలం 40 శాతం టార్గెట్ రీచ్ కావడంతో అధికారులకు నిర్ఘాంతపోయారు. ఈ సారి కూడా 32300 స్టాండర్డ్ బ్యాగుల టార్గెట్ ఆధారంగా మరోసారి తునికాకు టెండర్లు అప్పగించేందుకు ప్రభుత్వం చూస్తోంది. గతంలో మాదిరిగా ఆకు సేకరణకు గిరిజనులు, ఇతర కార్మికులు మక్కువ చూపడం లేదని అటవీ అధికారులు సూత్రప్రాయంగా చెబుతున్నారు. (Story : ఆకుకు అదునుదాటుతోంది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!