Homeవార్తలుతెలంగాణఅవును మేమంతా ఇక్కడే చదువుకున్నాం

అవును మేమంతా ఇక్కడే చదువుకున్నాం

అవును మేమంతా ఇక్కడే చదువుకున్నాం

– నేడు జిఎంఆర్ పాలిటెక్నిక్ పూర్వవిద్యార్ధుల మెగా సమ్మేళనం

– 25 సంల. బ్యాచీలతో గెట్ టూ గేదర్

– గురువులను సన్మానించుకోనున్న విద్యార్ధులు

– కనీవినని రీతిలో ఏర్పాట్లు

– చదువులమ్మ ఒడికి తరలివస్తున్న పూర్వ విద్యార్థి లోకం

– ఎవరిని కదిపినా ఆనంద భాష్పాలే

– ఒకటి చేసిన వాట్సాప్ కి హ్యాట్సాప్

న్యూస్‌తెలుగు/ గజ్వేల్ : రాష్ట్ర విభజనకు ముందు అప్పటి మెదక్ జిల్లాలోని గజ్వేల్ మండలం సంగాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆదర్శ గురుకుల కళాశాల ఇది. ఇక్కడ 1988లో కళాశాలను ఏర్పాటు చేశారు. గజ్వేల్ సుమారు 5 కిమీ. దూరంలో ఉండే ఈ కాలేజీకి అప్పట్లో విద్యార్ధులు చేరుకోవాలంటే సొంత వాహనాలు, కాలినడకే శరణ్యం. చదువుకోవాలనే తపనతో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసి, అందులో ర్యాంకు సాధించి కౌన్సిలింగ్లో సీటు దక్కించుకునే వారు. ఈ కాలేజీలో మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్ కోర్సులున్నాయి. తొలిరోజుల్లో ఆటోమోబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు కూడా ఉండేది. అప్పట్లో ఇది ఓ మారుమూల ప్రాంతం, అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గొప్పగా కనీవినీ రీతిలో అభివృద్ధికి నోచుకుంది. స్వయాన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాతనిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఈ గజ్వేలే కావడం విశేషం.

గెట్ టూ గేదర్ ////-
25 సం.వరకు ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ ఆదివారం గెటూగేదర్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వేలాది మంది వివిధ ప్రాంతాల నుండి తరలిరానున్నారు. ఈ కార్యక్రమానికి చదువులు చెప్పిన ప్రతీ అధ్యాపకులను ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి వినమ్రతతో నమస్కరించి రావాలంటూ కోరారు. వారు కూడా తమ పిల్లల్లాంటి విద్యార్ధులను మనసారా కలుసుకుని మరో సారి దీవించేందుకు ఎదురు రానున్నారు. పూర్వ విద్యార్థులు సైతం గురువుల కాళ్లకు పాతాభినమస్కారాలు చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందు కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. గజ్వేల్ మండల కేంద్రం నుండి 5 కి.మీ దూరంలో ఉన్న కాలేజీ వరకు విద్యాబుద్ధులు నేర్పి మంచిమార్గాన్ని చూపిన అధ్యాపకులను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీర్యాలీ నిర్వహిస్తారు. కార్యక్రమం విజయవంతానికి సీనియర్ పూర్వ విద్యార్ధులు శ్రమిస్తున్నారు. ఈ గుట్ టూ గేదర్ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యయనం కానుంది.

తరలిరానున్న పూర్వ విద్యార్ధి లోకం///// – మాటల్లో చెప్పలేని మధురాని భూతి కోసం పూర్వ విద్యార్థి లోకం తరలివస్తోంది.
కాలేజీ హాస్టల్ లో ఉండే ఏ, బి, సి, డి, ఇఎ,ఫ్ హాస్టల్ బ్లాక్లు, వారు అప్పట్లో ఉన్న రూమ్లను మనసారా చూసుకోవాలని తపన పడుతున్నారు. మెసల్లో కలిసికట్టుగా తిన్న టిఫిన్లు, భోజనాలు, ప్రత్యేక రోజుల్లో స్పెషల్ వంటకాలు ఆదివారం చికెన్తో ఒక్క పూట భోజనం, రాత్రికి అరటిపండ్లు తలుచుకుంటూ లొట్టలు వేసుకుంటున్నారు. హాస్టల్ నుండి నడుచుకుంటూ కాలేజీకి చేరుకునేందుకు ఉన్న ఎన్నో ఒంపుసొంపులు, పచ్చని ప్రకృతి, పలుకరించే కొండలు, కోనలు, పక్షుల కిలకిలరావాలు అన్నీ మనస్సు నిండా నింపుకుని పంచుకునేందుకు అతృతపడుతున్నారు. కాలేజీ పై అంతస్తులోని తరగతి గదుల పలుకరింపుల కోసం పరితపిస్తున్నారు. మూడేళ్ల పాటు ఒకే కుటుంబం ఉంటూ చదువుకుని దూరమైన విద్యార్థులు వారి స్నేహితులను ఈ వేదికగా కలుసుకునేందుకు ఆతృత చూపిస్తున్నారు. కాలేజీ ముందు ఉండే ముస్లీం అమ్మల టీ షాపుల్లో తాగిన తేనీటి వేడి ఇంకా పెదాలపైనే ఉందనే సంతోషాన్ని పంచుకునేందుకు ఉరుకులు పెడుతున్నారు. మెస్ లో వంటలు వండిపెట్టిన వారిని, వడ్డించిన వారిని, గదులు, పరిసరాలు శుభ్రం చేసిన వారిని కలుసుకుని మేము గుర్తున్నామా అంటూ పలుకరించేందుకు వేగిరపడుతున్నారు. ఈ శుభ తరణాన దేశ, విదేశాల్లో స్థిరపడ్డన వారు, పలు రంగాల్లోని ఉన్న వారు ఈ కార్యక్రమాన్నికి తరలివస్తున్నారు.

ఎవరిని కదిపినా ఆనంద భాష్పాలే/// – పూర్వ విద్యార్థుల సమ్మేళనం తేది ఖరారైన నాటి నుండి ఎవరిని కదిపించినా ఆనందభాష్పాలే రాలుతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత మన కాలేజీకి వస్తున్నాం రా…ఎలా ఉన్నావురా బాగున్నావా… కుటుంబ, పిల్లల సంగతి ఏంట,. నేను వస్తున్నాను, బ్యాగ్ సర్దేశాను, నువ్వుకూడా తప్పకుండా రా.. మిస్ కొట్టాకు, అక్కడ కలుసుకుని ఆ రోజులను మరో సారి జ్ఞాపకాలు పంచుకుందాం, మాజీ టీ షాపులో అప్పటి లాగానే టీ ఇప్పిస్తాలే వచ్చేయ్, మన కాలేజీ పరిసరాల్లో మరోసారి కలియతిరుగుదాం అంటూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మరోసారి జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ వేదికగా కలుసుకోబుతున్న ఈ పూర్వ విద్యార్థుల ఆనందానికి అవదుల్లేకుందా పోతున్నాయి.

వాట్సాప్ హ్యాట్సాప్ //// – టెక్నికల్ విద్యను అభ్యశిస్తున్న విద్యార్ధులను టెక్నాలజీ మరోసారి ఒకటిగా చేసింది. వాట్సాప్ పుణ్యమా అంటూ అంతా ఏకమై హాట్సాప్ చెబుతున్నారు. వాట్సాప్ రాకముందు అతికొద్ది మందిగా కలుసుకునే వారు ఇప్పుడు అంతా ఒకే వేదికపైకి వచ్చారు. గ్రూప్ గా ఏర్పిడిన విద్యార్ధి లోకం తోటి స్నేహితుల కుటుంబాలు కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని చెబుతూ మేమున్నాం అంటూ భరోసా కల్పిస్తున్నారు. యాంత్రిక జీవనంతో పాటు పెనువేసుకున్న స్వార్థ ప్రయోజనాలు హెచ్చుమీరుతున్న ఈ రోజుల్లో కూడా స్నేహానికి, అనుబంధాలకు విలువనిస్తూ జిఎంఆర్ పాలిటెక్నిక్ – గజ్వేల్ విద్యార్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు అనడంలో ఈ పూర్వవిద్యార్ధుల సమ్మేళనమే ఓ చక్కటి నిదర్శనం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!