జయహో జనయిత్రీ

జయహో జనయిత్రీ

– ఆకాశంలో సగం అవకాశాల్లో ఆగం

– వెంటాడుతున్న లింగవివక్షత

– వెలుగు చూడని అగాయిత్యాలు

– అడవుల్లో మహిళా దినోత్సవం

– అక్కరకు రాని చట్టాలు

– నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

“యత్రనార్యస్యు పూజ్యంతే రమంతే తత్ర దేవతా” ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కానీ అలాంటి దేవతలు నేటికీ ఆటవస్తువులుగా, అంగటి సరుకులుగా చిత్రీకరించబడుతున్నారు. దేవతగా కొలవాల్సిన స్త్రీమూర్తులపై అత్యాచార సంస్కృతికి ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైనప్పటికీ సమానత్వానికి నేటికీ నోచుకోవడం లేదు. ఆడపిల్లంటే చాలు రక్తపు ముద్దగా ఉన్నప్పుడే బ్రతకనివ్వని క్రూరమైన కుట్రలు జరుగుతున్నాయి. లింగసమానత్వానికి ఆమడదూరంలో ఉన్న పరిస్థితులు అదిగమించడానికి అంతా వేగవంతమైన నిర్మాణాత్మక చర్యలు తీసుకున్న నాడే అమ్మతత్వం పరిడమిల్లే పరిస్థితి లేదు. ఇందుకోసం అంతా కలిసికట్టుగా నడుం బిగించిన నాడే జనయిత్రి జైజైలు అంచుకుటుంది.

న్యూస్‌తెలుగు/ భద్రాచలం: ఆకాశంలో సగమైన స్త్రీమూర్తి అవకాశాల్లో మాత్రం ఆగమవుతున్నారు. తలరాదను ఎదురించి ఆత్మగౌరవాన్ని మదినిండా నింపుకుని ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుంకుంటున్నప్పటికీ నేటి సమాజంలో ఇంకా మహిళల స్థితిగతులు, మనుగడలో ఆశించినన్ని మార్పులు రాలేదనేది అక్షరసత్యం. ఆ మార్పు ఆశించిన స్థాయిలో వచ్చిన నాడే ఈ సమాజ పురోభివృద్ధి సాధ్యమవనుంది. ఈ సృష్టి మూలాల్లో మహిళకు ఉన్న ప్రాధాన్యత చాలా మాటలతో వర్ణించలేనిది. అందుకే ఓర్పు, సహనం, సాహసానికి స్త్రీలింగాన్నే చూపిస్తారు. అందుకే ఎక్కడ స్త్రీలు పూజించ
బడతారే అక్కడ దేవతలు కొలువై ఉంటారనినేది సత్యం. కానీ దేవతలుగా కొలవాల్సిన స్త్రీ మూర్తులను ఆట వస్తువులుగా, అంగడి సరుకులుగా, కోర్కేలు తీర్చే వారిగా చూస్తున్నారు. అంతేకాకుండా అనునిత్యం దేశంలో ఏదో ఒక మూల అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఉన్మాదుల చేతుల్లో బలైపోతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమానత్వపు సవాళ్లను తొలినాళ్ల నుండి ఎదుర్కొంటున్న మహిళా లోకు ఆ వివక్ష నుండి బయటపడాలంటే లింగ సమానత్వాన్ని సాధించడానికి నిర్మాణాత్మక చర్యలు వేగవంతంగా తీసుకోవాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఐఖ్యరాజ్యసమితి చాటి చెబుతోంది.

అంది పుచ్చుకోవాలి ////– ఆకాశంలో సగమైన మహిళలు నేటి సమాజంలో సమానత్వాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. కొద్దిగా మార్పుచెందిన ఈ రోజుల్లో స్త్రీలు వంటింటికి స్వస్తి చెప్పి విద్యావైద్య రంగాలవైపు అడుగులేస్తున్నారు.. వ్యాపారాలు, రాజకీయాల్లో రాణిస్తున్నారు. అంతరిక్ష యాత్రలు, శాస్త్ర సాంకేతిక రంగాలవైపు దూసుకుపోతున్నారు. మానవ వనరుల వినియోగంలో వీరిపాత్ర కూడా చాలా కీలకంగా మారుతోంది. అది విరంగమైనప్పటికీ వారికంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని ఏర్పాటు చేసుకుని మందుకు సాగుతున్నారు. పరుషుని ప్రతీ విజయం వెనుక ఉండే కీలకంగా ఉండే స్త్రీ ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళాశక్తిని ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేస్తూ ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. అంటగాణ తల్లులంతా దీనిని సద్వినియోగం చేసుకుని సవాళ్లను అదిగమిస్తూ దేనిలోనూ తాము పురుషులకంటే తక్కువ కాదని చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వెంటాడుతున్న లింగవివక్ష//// – దేశంలో లింగవివక్ష పెద్ద ఎత్తున వెంటాడుతోంది. దేశీయగణాంకాల ప్రకారం ఆడ పిల్లల జననాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో సహజంగానే పరుషాధిక్యత పెరిగిపోతోంది తల్లిగర్భంలో ఉన్నప్పుడే చట్ట వ్యతిరేక లింగనిర్ధారణ పరీక్షలు చేయించి రక్తపు ముద్దలను చిదిమేస్తున్నారు. కోకొల్లలుగా వెలిసిన స్కానింగ్ సెంటర్ల కాసులకక్కుర్తి కూడా ఇందుకు ప్రధాన కారణం. గర్భంలోనే వివక్షత ఎదుర్కొంటున్న ఆడపిల్ల సమాజంలోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఆడ పిల్లలు బయటకు వెళితే ఇంటికి వచ్చేంత వరకు తల్లిదండ్రుల్లో చెప్ప లేనంత భయం. ఆకతాయిలు, పోకిరీల వెకిలి చేష్టలకు ఎక్కడ
బలైపోతారో అనే ఆందోళన, మరో ప్రక్క కట్టుబాట్ల పేరును పులమడంతో స్వేచ్ఛా సమానత్వాలను కోల్పోయి వెనుకబాటు తనానికి గురవుతున్నారు. ఒకానొకదశలో ఇంట్లో అప్పటికే మగబిడ్డ ఉన్నా ఆడ పిల్లలకు రక్షణ ఇవ్వలేమంటూ తల్లిదండ్రులు మళ్లీ మగ శిశువే జన్మించాలంటూ దేవుళ్లకు మొక్కుతున్న సందర్భాలు లేకపోలేదు. గత ఏడాది మణిపూర్ ఘటనలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. మన దేశంలో మహిళారక్షణ మృగ్యమైంది. సభ్య సమాజ చైతన్యాన్ని, సామాజిక బాధ్యతను కాడెడ్లలా లాక్కుంటూ సాగుతున్న మహిళలపై దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భిన్న వైఖరులను చవిచూస్తున్న స్త్రీలు దారుణాతి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అడవుల్లో సైతం మహిళల మానప్రాణాలకు రక్షణ లేదంటూ మావనహక్కుల సంఘాలు నెత్తీనోరు బాదుకుంటున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ పురుషాధిక్య ముందు నీరుగారి పోతున్నాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అవరోదాలను అదిగమిస్తూ అడుగులు ముందుకేయాలి.

అడవుల్లో మహిళా దినోత్సవం //// — అడవుల్లో సైతం మహిళా సమాన్వతం కోసం మావోయిస్టులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతీ ఏటా అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ సభలు, సమావేశాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిని చిత్రీకరిస్తూ బాహ్యప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా విడుదుల చేస్తున్నారు.

113 సం.లుగా ////అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈ ఏడాదితో 113 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాయి. మహిళా దినోత్సవాన్ని తొలిరోజుల్లో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా పిలిచే వారు. తొలినాళ్లలో ఈ మహిళా దినోత్సవం హక్కులు, గౌరం, గుర్తింపు కోసం మొదలైంది. బఖ్యరాజ్య సమితి ఈ ఏడాది అంతర్జాతీయ దినోత్సవాన్ని లింగ వివక్షను వేగవంతంగా అదిగమించేందుకు అంతా కృషి చేయాలనే నినాదంతో జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈ పురుషాధిక్య ప్రపంచంలో జననికి జయం చేకూరాలని ఆశిద్దాం. ఆదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అన్ని రంగాల్లో విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు తెలుపుదాం. (Story : జయహో జనయిత్రీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!