మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేసిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఖిల్లా గణపురం మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన డి. బాల కిష్టమ్మ , కె. వర్షిని అనారోగ్యం తో నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. బాల కిష్టమ్మ కు 2,50,000/-విలువగల ఎల్ ఓ సి ని వర్షిని కి 2,00,000/-విలువగల ఎల్ఓసి పత్రాన్నిరాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అందజేశారు.
ప్రత్యేక చొరవతో చిన్నారెడ్డి ఎల్ ఓ సి పత్రాలను అందజేసినందుకు బాలకిష్టమ్మ , వర్షిని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ ,వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దేవన్న యాదవ్, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు రఘు, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (Story : మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేసిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి)