వేసవిలో తాగు,సాగు నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి:
వేసవిలో తాగు సాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా నేత, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీరామ్, సిపిఐ పట్టణ కార్యదర్శి జి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం వనపర్తి సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భీమా కాల్వ కింద రైతులు పంటలను వేసుకున్నారని కాల్వకు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేతేపల్లి డి 24 భీమా కాల్వకు నీళ్లు రాక పానగల్, వీపనగండ్ల మండలాల్లో పంటలకు, మామిడి తోటలకు నీరు అందటం లేదని, ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు పంటలకు అందించాలన్నారు. పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి, బొల్లిగట్టు కే ఎల్ ఐ కాల్వ ద్వారా నీరు వచ్చి, కేతేపల్లి బర్రెంకలయ్య జాలు వద్ద వృధాగా కిందకు పోతుందన్నారు.దాన్ని భీమా కాలువ డి. 24 కు అనుసంధానం చేస్తే పానగల్ వీపనగండ్ల మండల పలు గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. అందుకోసం అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాపలు గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి కూడా మొదలైందని, కేతేపల్లి భగత్ సింగ్ నగర్, గోకర పాయ మిట్ట తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథతాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పలు గ్రామాల్లో తాగునీటి సమస్య మొదలైనట్లు చెబుతున్నారని, ముందు జాగ్రత్త చర్యగా బోర్లు, వాటర్ స్కీములు, కాలిపోయిన మోటార్లను బాగు చేయించాలన్నారు. గ్రామాల్లో వేసవి ఉపాధి ఆమె పనులు ప్రారంభించి సుమారు వారం రోజులు అవుతోందన్నారు. ఎండలు తీవ్రంగ ఉన్నందున,ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు తాగునీరు, నీడ, మెడికల్ కిట్లు,ORS పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.పలు ఆర్టీసీడిపోల నుంచికాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారని, వేసవి ఎండలకు చెడిపోతున్నాయని కొత్త బస్సులు వెయ్యాలన్నారు.
అరకొరగా సంక్షేమ పథకాల అమలు: రమేష్
రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఇప్పటివరకు అరకొరగానే అమలైందనిసిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ అన్నారు. పూర్తిస్థాయిలో మాఫీ చేయాలన్నారు.సింగిల్ విండొల్లో అప్పు లెక్కలు తప్పులు తడకగా ఉన్నాయని, చాలామందికి మాఫీ కాలేదన్నారు. మాఫీ కోసం అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. రైతు భరోసా మూడు ఎకరాల వరకు వేసామని ప్రభుత్వం చెబుతున్నా, ఎకరం ఎకరం న్నర భూమి ఉన్న చాలామంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడలేదన్నారు. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు చాలామందికి అందలేదన్నారు.రూ. 500 లకు సిలిండర్ సబ్సిడీ చాలామంది వినియోగదారుల ఖాతాల్లో పడటం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, వ్యవసాయ కూలీలకురూ. 12000 మంజూరి కాలేదన్నారు. మహిళలకు రూ. 2500, ఆసరా పింఛన్ల పెంపు కోసం అర్హులైన వారు ఎదురుచూస్తున్నారన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లకు మూడేళ్ల కింద దరఖాస్తులు చేసుకున్న కొత్త పింఛన్లు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. సిపిఐ నాయకులు పెద్ద హనుమంతు, లక్ష్మీనారాయణ,కాకం చిన్న రాముడు తదితరులు పాల్గొన్నారు . (Story b: వేసవిలో తాగు,సాగు నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి)