Homeక్రీడలుఛాంపియన్స్‌ ట్రోఫీ: ఫైనల్స్‌లో టీమిండియా

ఛాంపియన్స్‌ ట్రోఫీ: ఫైనల్స్‌లో టీమిండియా

ఛాంపియన్స్‌ ట్రోఫీ: ఫైనల్స్‌లో టీమిండియా

సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం
రాణించిన కోహ్లీ, షమీ, రాహుల్‌

దుబాయ్‌: భారత క్రికెట్‌ జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌కు చేరుకుంది. చాన్నాళ్ల తర్వాత మరోసారి కప్‌ అందుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంటులో భాగంగా ఇక్కడ జరిగిన తొలి సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులు (49.3 ఓవర్లు) చేయగా, భారత్‌ ఇంకా 11 బంతులు మిగిలిఉండగానే 6 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసి అపూర్వమైన విజయం సాధించి, ఫైనల్స్‌లోకి దూసుకుపోయింది. బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించిన విరాట్‌ కోహ్లీ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. షమీ బౌలింగ్‌ కూడా భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. నిజానికి టీమిండియా సాధించిన సమష్టి విజయమిది. ఏ ఒక్కరిపైనో భారం పడకుండా, ఆటగాళ్లందరూ రాణించి, జట్టును ఫైనల్స్‌కు చేర్పించారు. బుధవారం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్టుతో భారత్‌ టైటిల్‌ పోరు ఆడుతుంది.


265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఆచితూచి ఆడిరది. కాకపోతే 8 ఓవర్లు ముగియకముందే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిరది. ముఖ్యంగా శుభ్‌మన్‌ గిల్‌ (8) అనూహ్యంగా డ్వారుషుస్‌ బౌలింగ్‌లో అంచనాతప్పి వికెట్లు సమర్పించుకున్నాడు. కాసేపటికి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కానలీ ఎల్బీకి దొరికిపోయాడు. డీఆర్‌ఎస్‌ అప్పీలు అడిగినా ఫలితం దక్కలేదు. రోహిత్‌ 29 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. 50 పరుగుల్లోపే రెండు వికెట్లు పోగొట్టుకోవడంతో భారత శిబిరం నిరాశలో పడిరది. ఈ దశలో విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌లు అద్భుతమైన బ్యాటింగ్‌తో, మంచి సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును పరుగెత్తించడమే కాకుండా, ఆసీస్‌ ఫీల్డర్లకు చెమటలు పట్టించారు. వారు భారీ షాట్లకు ప్రయత్నించకుండా అవసరమైనప్పుడు మాత్రమే బంతిని బౌండరీకి తరలిస్తూ మూడో వికెట్టుకు 91 పరుగుల భాగస్వామ్యం అందించారు. కోహ్లీ సకాలంలో అర్థసెంచరీ పూర్తి చేయగా, శ్రేయాస్‌ ఐదు పరుగుల దూరంలో మిస్సయ్యాడు. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో శ్రేయాస్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. శ్రేయాస్‌ 62 బంతుల్లో 3 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్‌ పటేల్‌ సాయంతో కోహ్లీ స్కోరును మరికాస్త ముందుకు నడిపించాడు. అక్షర్‌ (27) ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌తో జోరు మీద ఉన్నట్లు కన్పించినప్పటికీ, ఎల్లిస్‌ అతన్ని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో కోహ్లీకి కేఎల్‌ రాహుల్‌ తోడయ్యాడు. ఇరువురూ ఎంతో జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 200 దాటించారు. ఐదోవికెట్టుకు 47 పరుగులు జోడిరచిన వీరి భాగస్వామ్యాన్ని జంపా విడదీశాడు. అతని బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ బౌండరీలైన్‌లో ఉన్న డ్వార్‌షుస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లీ 98 బంతుల్లో ఐదు ఫోర్లతో 84 పరుగులు చేశాడు. కోహ్లీ ఎంతో ఓపిగ్గా రాణించి, ప్రశంసలు పొందాడు. కోహ్లీ తర్వాత కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యాలు సహనాన్ని పక్కనబెట్టి, ఉతుకుడు మొదలుపెట్టారు. ఇరువురూ దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీ లైన్‌ వైపు పంపించారు. రాహుల్‌ 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులతో అజేయంగా నిలవగా, పాండ్యా కేవలం 24 బంతుల్లో 1 ఫోరు, 3 భారీ సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఎల్లిస్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అది కూడా 28వ ఓవర్‌లో విజయానికి చేరువలో అవుటయ్యాడు. రాహుల్‌, పాండ్యాలు 6వ వికెట్టుకు 34 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించారు. జడేజా 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ ఖాతాలో 267 పరుగుల చేరాయి. ఆసీస్‌ బౌలర్లలో ఎల్లిస్‌, జంపా రెండేసి వికెట్లు, కానలీ, డ్వార్‌షుస్‌ చెరొక వికెట్టు తీసుకున్నారు.


అంతకుముందు, ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఆదిలోనే ఆసీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మట్‌ షార్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కూపర్‌ కానలీ 9 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే మహమ్మద్‌ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌ దారిపట్టాడు. ఆ తర్వాత ట్రేవిస్‌ హెడ్‌, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌లు కొద్దిసేపు సమన్వయంతో ఆడుతూ రాణించారు. ముఖ్యంగా హెడ్‌ వీరవిహారం చేశాడు. 9వ ఓవర్‌లో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ పట్టిన క్యాచ్‌కు ట్రేవిస్‌ హెడ్‌ అవుట్‌ కావడం దెబ్బతీసింది. హెడ్‌ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. స్మిత్‌కు మార్నస్‌ లబుషానే తోడయ్యాడు. ఇరువురూ మూడో వికెట్టుకు 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. 23వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన లైన్‌ అండ్‌ లెన్త్‌ బంతికి లబుషానే ఎల్బీగా అవుటయ్యాడు. జోష్‌ ఇంగ్లీస్‌ (11) కూడా ఎంతోసేపు క్రీజ్‌లో నిలవలేదు. జడేజా బౌలింగ్‌లో కోహ్లీ పట్టిన క్యాచ్‌కు అతను పెవిలియన్‌ ముఖంపట్టాడు. స్టీవ్‌ స్మిత్‌ మాత్రం ఓపిగ్గా ఆడి 96 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. అది కూడా 37వ ఓవర్‌లో జరిగింది. తదుపరి ఓవర్‌లోనే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(7)ను అక్షర్‌ పటేల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఈ తరుణంలో అలెక్స్‌ కేరీ క్రీజ్‌లోకి వచ్చి అద్భుతమైన ఆటతీరుతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అతను దాదాపు ఆఖరివరకూ క్రీజ్‌లో నిలిచాడు. ఈలోగా బెన్‌ డ్వార్‌షుస్‌ (19), ఆడమ్‌ జంపా (7), నాథన్‌ ఎలిస్‌ (10) క్రమం తప్పకుండా వికెట్లు పోగొట్టుకున్నారు. కేరీ మాత్రం 57 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 61 పరుగులు చేసి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అతను రెండో పరుగు కోసం చేసిన ప్రయత్నంలో శ్రేయాస్‌ అయ్యర్‌ రనౌట్‌ చేశాడు. ఆసీస్‌ స్కోరు 264 వద్ద ముగిసింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు, వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజాలు రెండేసి వికెట్లు, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌లు చెరొక వికెట్టు తీసుకున్నారు. (Story: ఛాంపియన్స్‌ ట్రోఫీ: ఫైనల్స్‌లో టీమిండియా)

Follow the Stories:

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రీక్ష‌!

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!