కాంగ్రెస్ ప్రభుత్వం ఒకమతానికి మేలు చేస్తుంది ఒక మతాన్ని కించపరుస్తుంది
న్యూస్‌తెలుగు/వనపర్తి : రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఈనెల 6 నుండి నిర్వహించే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుండి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదుఅని వనపర్తి జిల్లా బిజెపిదార్మికసెల్ (ఎండోమెంట్) కో కన్వీనర్ భగవంతుయాదవ్ తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేసే సమయం. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తరువాత విధుల నుండి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయి. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసంఅని అన్నారు. ఒక వర్గం వారిని మెప్పించేందుకు యావత్ విద్యార్థుల కడుపు మాడ్చడం న్యాయమా ?
తబ్లిగీ జమాతే వంటి విదేశాల్లో నిషేధిత సంస్థ మన రాష్ట్రంలో సభలు నిర్వహించుకుంటే ఏకంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారు. రంజాన్ కు డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారు. రంజాన్ కు బహమతులు అందిస్తారు. మక్కా వెళ్లేందుకు ఉచిత వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారు. కానీ అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వడం లేదు. హిందూ పండుగలకు ప్రత్యేక నిధులూ కేటాయించరు. శివరాత్రి పండుగ సందర్బంగా హిందువులంతా ఉపవాసం, జాగరణ చేస్తారు. మరుసటి విశ్రాంతి తీసుకుంటారు. కనీసం అప్షనల్ హాలీడే కూడా ఇవ్వలేదు. పైగా హిందూ పండుగల సమయంలో నిబంధనల పేరుతో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఇదేనా సమానత్వమంటే ?
హిందువులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనా ?
కాంగ్రెస్ తీరు తీవ్ర అభ్యంతరకరం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలని అన్నారు. (Story : కాంగ్రెస్ ప్రభుత్వం ఒకమతానికి మేలు చేస్తుంది ఒక మతాన్ని కించపరుస్తుంది) .