హక్కుల సాధన కోసం పోరాటమే మార్గం
AITUC రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ
న్యూస్‌తెలుగు/వనపర్తి : సెకండ్ ఏఎన్ఎం ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం AITUC జిల్లా కార్యాలయంలో కృషావేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల యొక్క హక్కుల సాధన కోసం వర్గ పోరాటాలే మార్గం అని పోరాటాల ద్వారానే విజయాలు సాధిస్తామని తెలిపారు. సెకండ్ ANM ల సమస్యలు పరిష్కారం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామని ఈ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సమస్యలకు ఫలితాలను రాబట్టామని.. కార్మిక వర్గం సంఘటితంగా పోరాటం చేస్తేనే పాలకవర్గాలు పనిచేస్తాయని తెలిపారు. సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని సెకండ్ anm ల కు 100% గ్రాఫ్ శాలరీ తో ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని. ఇటీవల రాసిన ఎగ్జామ్స్ పోస్టులను పెంచాలని. ఉద్యోగాలకు అర్హులు కానీ సెకండ్ ఏఎన్ఎం లకు 100% గ్యాస్ శాలరీ తో పాటు గ్రాడ్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ సమస్యల పరిష్కార సాధన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐటీయూసీగా తిరగబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ సెకండ్ ఏఎన్ఎం ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి. లక్ష్మమ్మ. సుమిత్ర. అరుణ మాధవి.పార్వతి.విజయ లక్ష్మి. శివ లీల. నాగ లక్ష్మీ. ఆరతి.ఈశ్వరమ్మ.తదితరులు పాల్గొన్నారు. (Story : హక్కుల సాధన కోసం పోరాటమే మార్గం)