బాల్య వివాహాలను అరికట్టాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేర్ మండల పరిధిలో పోలీస్ స్టేషన్ లో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి రాజశేఖర్ ఆధ్వర్యంలో బుక్స్,క్యాలెండర్, పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది.18 సంవత్సరాలు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి పెళ్లిళ్లు చేయకూడదని పిల్లలను బడి మాన్పించి పనిలో పెట్టకూడదని చదువుకోవడం పిల్లల హక్కు అని అమ్మాయిలను వేధించిన మానసికంగా హింసించిన చిన్నారులను అక్రమంగా రవాణా చేసిన ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు జరిగినట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 & 112 పోలీస్ 100 లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలి. 2006 బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం బాల్య వివాహాలు జరిగితే శిక్ష అర్హులు అవుతారు. లైంగిక నేరాల నుండి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం ఫోక్సో 2012 ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాలికలపై లైంగిక వేధింపులు లైంగిక దాడులు నిషేధించడమైనది . కార్యక్రమంలో ఎస్సై సిహెచ్ హరిప్రసాద్ రెడ్డి, బి శ్రీనివాసులు ASI, తదితరులు పాల్గొన్నారు. (Story : బాల్య వివాహాలను అరికట్టాలి)