గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 శుక్రవారం రోజు మరి కుంట పాల కేంద్రం నుండి వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సూపరిండెంట్ గారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు మాట్లాడుతూ వనపర్తి జిల్లాల్లో గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల నుండి ఆరు నెలల వరకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వేతనాలు సకాలంలో రాకపోవడం వల్ల గ్రామపంచాయతీ కార్మికులు అప్పులు చేసి కుటుంబాలు గడుపుతున్నారని నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉంటే ఎలా జీవించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగుల వలె ప్రతినెల 1వ తేదీ నాడే కార్మికులకు వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్మికులకు ప్రధాన ఆటంకంగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని మన జిల్లాలో కార్మికులకు సబ్బులు నూనెలు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని వెంటనే ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కార్మికులకు సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని బ్లౌజులు షూస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ ఎన్ రమేష్ సిఐటియు జిల్లా నాయకులు నందిమల్ల రాములు మధు గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు పుష్ప హనీఫ్ అక్తార్ పాషా దాసు శీను నారాయణ కాశయ్య వెంకటేష్ భాస్కర్ అజిత్ చెన్నమ్మ రామచంద్రయ్య పెంటయ్య సుగ్రీవుడు ఖాదర్ మధు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి)

