ప్రజల్లో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన చేయండి
అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సైబర్ నేరాల అడ్డుకట్టకు కృషి చేయండి
ప్రజల్లో అవగాహన తేవడం, అప్రమత్తం చేయడమే మన లక్ష్యం
ఇప్పటి వరకు జిల్లాలో డిజిటల్ వాహనాల ద్వారా సుమారు 50 వేల మందికి రీచ్ అయ్యాం
న్యూస్ తెలుగు/అనంతపురం : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రజల్లో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన చేసి సైబర్ నేరాల అడ్డుకట్టకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో… జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిల్లోని గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, జాతరలు, తిరునాళ్లలో సైబర్ మోసాల పట్ల అవగాహన చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవైపు డిజిటల్ వాహనాలు… ఇంకో వైపు టాంటాం వాహనాల ద్వారా సైబర్ నేరాలు నిరోధించడానికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై విద్యార్థులు, ఉద్యోగులు… ఇలా అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా డిజిటల్ వాహనాల ద్వారా వీడియోలు చూయించడం… టాంటాం ఆటోల ద్వారా ఆడియోలు విన్పించడం చేస్తున్నారు. “సైబర్ సురక్ష” (మన భద్రత- మన బాధ్యత) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అవగాహనలకు ప్రజలు, విద్యార్థుల నుండీ భారీ స్పందన లభిస్తోంది. ఈనెల 13 నుండీ ఇప్పటి వరకు జిల్లాలో డిజిటల్ వాహనాలు, ద్వారా సుమారు 50 వేల మందికి రీచ్ అయ్యారు. ముఖ్యంగా … డిజిటల్ అరెస్టు, ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ , ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ … డెబిట్, క్రెడిట్ కార్డు ఫ్రాడ్, యూపీఐ ఫ్రాడ్ … పార్ట్ టైం జాబ్, టాస్క్, జాబ్ ఫ్రాడ్ … ఏ పి కె, లింక్,మెసేజీ ఫ్రాడ్… ఏ ఈ పి ఎస్ ఫ్రాడ్ , ఫేక్ లోన్ యాప్ ఫ్రాడ్స్ పై ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూయించి వివరిస్తున్నారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి… సైబర్ నేరగాళ్ల భారిన పడకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు.మీరు సైబర్ మోసగాళ్ళ బారిన పడ్డార వెంటనే మౌనం వీడి సైబర్ క్రైమ్ *టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు సైబర్ క్రైమ్ పోర్టల్ .సైబరక్రైమ్ .గోవ్ .ఇన్ ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.(Story: ప్రజల్లో సైబర్ మోసాలపై విస్తృత అవగాహన చేయండి )

