వృక్షార్చనతో కెసిఆర్ జన్మదిన వేడుకలు
న్యూస్‌తెలుగు/వనపర్తి: తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంచి అనంతరం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హరితహరంలో భాగంగా వృక్షార్చన చేపట్టడం జరిగింది. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పి.రమేష్ గౌడ్, బి.లక్ష్మయ్య, కురుమూర్తి యాదవ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్, కంచె రవి, ఉంగ్లమ్ తిరుమల్, ప్రేమ్ నాథ్ రెడ్డి, స్టార్ రహీమ్, రమేష్ నాయక్, గులాం ఖాదర్ ఖాన్, నీలస్వామి, ఇమ్రాన్, సూర్యవంశపు గిరి, హేమంత్ ముదిరాజ్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, సునీల్ వాల్మీకి, ఆరీఫ్, ఏకే పాషా, కవితా నాయక్, బండారు శ్వేత, బాగ్యరాజ్, జానం పేట శ్రీను, క్రాంతి కుమార్,రామస్వామి, వజ్రాల రమేష్, ఇంతియాజ్, శివ లక్ష్మణ్, అలీం, భాను తదితరులు పాల్గొన్నారు. (Story: వృక్షార్చనతో కెసిఆర్ జన్మదిన వేడుకలు)