కేసీఆర్ మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారు
న్యూస్‌తెలుగు/వనపర్తి: మాజీ మంత్రి సింగిరెడ్డి.వాసంతి నిరంజన్ రెడ్డి వారి వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్ గారి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణను పాడిపంటలతో ఆకుపచ్చ తెలంగాణ చేసిన కె.సి.ఆర్ గారి కృషికి గుర్తింపుగా కార్మికులతో కలసి మొక్కలు నాటి వృక్షార్చన చేపట్టి తమ ఆప్యాయత చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, 14ఏండ్ల సుదీర్ఘ పోరాటం రాష్ట్ర సాధన,రాష్ట్ర అభివృద్ధి ఒక్క కేసీఆర్‌కే సాధ్యమని అన్నారు. ప్రజలు కె.సి.ఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. (Story: కేసీఆర్ మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారు)