అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని, ఇల్లు నిర్మించుకుంటామనే భరోసా ఉన్న వారంతా ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవచ్చుననీ… సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా ప్రతి ఒక్కరికి అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని రాజీనామా చేయాలంటూ ఇటీవల KTR మాట్లాడిన మాటలకు ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే తండ్రి కొడుకు, బావ ముగ్గురు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని మీకు డిపాజిట్లు కూడా గల్లంతవ్వడం ఖాయమని ఖాయమని ఆయన సవాల్ విసిరారు
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిన మీరు నేడు గ్రామ గ్రామాన హరికథలు చెప్తే నమ్మేవారు ఎవరూ లేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన నాయకులు గ్రామాల మీద పడి అబద్ధాలు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారని అటువంటి వారిని ఎవరు నమ్మరాదని ఎమ్మెల్యే సూచించారు . వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పిటిసి వరకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఆయన వనపర్తి మండలం, వనపర్తి పట్టణానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు . (Story : అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు)