16న సర్.సి.వి రామన్ యంగ్ జీనియస్
అవార్డుల ప్రధానం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా : ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 32వ సర్.సి.వి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 20 మందికి గోల్డ్ మెడల్స్, 40 మంది ర్యాంకర్స్ కి మరియు 400 డిస్ట్రిక్ ర్యాంకర్స్ కి, 20 మందికి గురుబ్రహ్మ మరియు ఛత్రలయా పురస్కార్ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు పబ్లిక్ గార్డెన్స్, లలితా కళా తోరణం లో ప్రదానం చేయనున్నారు అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా డా”లయన్ కిరణ్, సూచిరిండియా అధినేత, (కాన్సల్ జనరల్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్) మరియు సినీనటుడు రావు రమేష్ పాల్గొనున్నారు. (Story : 16న సర్.సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం )