ఇసుక నిల్వలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక నిల్వలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం పెబ్బేరు మండల పరిధిలోని రాంపురం గ్రామ పరిధిలో 4-5 చోట్ల అక్రమంగా డంపు చేసిన దాదాపు 400 ట్రాక్టర్ల ఇసుకను ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ తో కలిసి తనిఖీ సందర్భంగా గుర్తించారు. అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిసిన సమాచారం మేరకు తనిఖీ కై వెళ్ళగా అక్రమ ఇసుక నిలువలను గుర్తించారు. అక్రమంగా డంపు చేసిన ఇసుకను వెంటనే సీజ్ చేయాలని, అక్రమంగా నిల్వలు చేసి అమ్ముకుంటున్న వారిని గుర్తించి కేసులు పెట్టాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ ఓనర్లపై కేసులు నమోదు చేయాలని ఆర్డీవో కు సూచించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పెబ్బేరు ఎమ్మార్వో లక్ష్మి, తదితరులు అదనపు ఉన్నారు.(Story : ఇసుక నిల్వలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు )