యదేచ్చగా మట్టి తవ్వకాలు
బెజ్జూర్ లో నాలుగు ట్రాక్టర్లు, ఒక జెసిబి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు
న్యూస్ తెలుగు/కొమరం భీం : ఆసిఫాబాద్ జిల్లాలో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలో గురువారం అర్ధరాత్రి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను, ఒక జెసిబి ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. బెజ్జూర్ ఎఫ్ ఆర్ ఓ ముసవీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మర్ది బీట్ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా మొరం మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు అందిన సమాచారంతో జెసిబి, నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు బషారత్ ఖాన్, ఖదీప్ ఖాన్, షేక్ బాబా, షేక్ ఖాన్, హైమత్ ఖాన్ ల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనాలను కాగజ్ నగర్ అటవీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు వివరాలు వెల్లడించారు.(Story : యదేచ్చగా మట్టి తవ్వకాలు )