వన్డే సిరీస్ 3-0తో భారత్ కైవసం
మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా శుభ్‌మన్ గిల్
దుమ్మురేపిన గిల్: టీమిండియా ఖాతాలో హ్యాట్రిక్ విజయం
అహ్మదాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఓటమి పరిపూర్ణమైంది. ఆ జట్టుతో జరిగిన ఆఖరి, మూడవ వన్డే మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయం సాధించి, సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. శుభ్‌మన్ గిల్ తన ఏడవ వన్డే సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక భూమిక వహించాడు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కే.ఎల్.రాహుల్ కూడా ఈ విజయంలో తలో చెయ్యి వేశారు. టీమిండియా రికార్డు స్థాయిలో 142 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లాండ్ కేవలం 34.2 ఓవర్లలోనే 214 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. సెంచరీ వీరుడు శుభ్‌మన్ గిల్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో రాణించిన అతనికే మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.
భారీ స్కోరు లక్ష్యంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తొలి ఆరు ఓవర్లలో వికెట్టు నష్టపోకుండా 60 పరుగులు చేసి ఇంగ్లాండ్ శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. బెన్ డకెట్ హర్షిత్ రాణా బౌలింగ్‌లో 4 బౌండరీలో సైతం కొట్టాడు. అయితే అనూహ్యంగా అర్షదీప్ సంధించిన నకెల్‌బాల్‌కు 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ అవుటయ్యాడు. ఇక అక్కడి నుంచి ఇంగ్లాండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. మూడో నెంబర్‌లో దిగిన టామ్ బాంటన్ వస్తూనే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడు. ఆ ఉత్సాహం ఎంతోసేపు సాగలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్లలో గస్ అట్కిన్సన్ ఒక్కడే 38 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 22 పరుగులిచ్చి 2, హర్షిత్ రాణా 31 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్టును కోల్పోయింది. కటక్ వీరోచిత పోరాటం రోహిత్‌లో ఈసారి కన్పించలేదు. తొలి పవర్ ప్లేలో 1వికెట్టుకు 52 పరుగులు చేసిన టీమిండియా అక్కడి నుంచి విజృంభించింది. కోహ్లీ తీవ్రమైన ఒత్తిడిలో సైతం రూట్ వేసిన రెండు ఓవర్లలో నాలుగు ఫోర్లు కొట్టాడు. గిల్ కూడా అట్కిన్సన్ బౌలింగ్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్ బాదాడు. లివింగ్‌స్టోన్ ఓవర్లలో ఇరువురూ తలో ఒక సిక్సర్ కొట్టి తమ అర్థసెంచరీలను పూర్తి చేశారు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కో|హ్లీ అవుటయ్యాక, గిల్‌కు శ్రేయాస్ అయ్యర్ తోడయ్యాడు. ఇక వీరిద్దర్నీ ఆపడం ఇంగ్లాండ్ బౌలర్లకు సాధ్యం కాలేదు. అయ్యర్ 78 పరుగులు చేసి అవుటయ్యాక, హార్దిక్ ను కూడా రషీద్ అవుట్ చేయడంలో సఫలీకృతుడయ్యాడు. కొద్ది సేపటికే అక్షర్ పటేల్ నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 40 పరుగులతో మెరుపులు మెరిపించాడు. కాకపోతే సాకిబ్ మహమూద్ సంధించిన యార్కర్‌కు దొరికిపోయాడు. ఎలాగైతేనేం, టీమిండియా 350 పరుగుల మార్కును దాటేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 64 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకోగా, మార్క్ వుడ్ 45 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. (Story: దుమ్మురేపిన గిల్ః టీమిండియా ఖాతాలో హ్యాట్రిక్ విజయం)
Follow the Stories:
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!