Homeవార్తలుతెలంగాణఅసంపూర్తి రోడ్ల విస్తరణతో సతమతమవుతున్న ప్రజానీకం

అసంపూర్తి రోడ్ల విస్తరణతో సతమతమవుతున్న ప్రజానీకం

అసంపూర్తి రోడ్ల విస్తరణతో సతమతమవుతున్న ప్రజానీకం

న్యూస్‌తెలుగు/వనపర్తి : పట్టణములో బి.ఆర్.ఎస్ మున్సిపల్ పాలన అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ మున్సిపల్ పాలనలో పరిశుభ్రత లోపించి అస్తవ్యస్తంగా తయారు అయిందని పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో మరింత నిర్లక్ష్యం వల్ల పారిశుధ్యం పడ్కేసిందని మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ గట్టు యాదవ్, వాకిటి.శ్రీధర్ ఆరోపించారు.కోటి 30లక్షల రూపాయలతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ఉపయోగించుకోకుండా చెత్త రోడ్ల ప్రక్కలో వేయడం వల్ల దుర్గంధం వస్తూ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అదేవిధంగా రోడ్ల విస్తరణ పానగల్ రోడ్డులో చేపట్టకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లకు ఇరువైపులా ఉన్న ట్రాన్స్ఫర్మర్ల వల్ల రాకపోకలకు ఇబ్బందులు జరుగుతున్నాయని అన్నారు. రామా టాకీస్ దగ్గర మొదట ప్రతిపాదించిన విధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే వరదలతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఎప్పటికపుడు కాలువలోని సిల్ట్ ఎత్తిపోయకపోవడం వల్ల దుర్గాంధంగా తయారైందని ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణ పారిశుద్దం పట్ల శ్రద్ధ చూపి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని కోరారు. పాలకులు వచ్చి 14నెలలు అవుతున్నా మిగిలిపోయిన రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం అభివృద్ధి పట్ల వారి చిత్తశుద్ధి తెలుపుతుందని అన్నారు.వెంటనే అసంపూర్తి రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత 6నెలలో మున్సిపల్ పాలన అవినీతిమయం గా సాగిందని ఇష్టానుసారం బిల్లులు పెట్టుకొని లబ్ధిపొందారని ఆరోపించారు.

పదవీ కాంక్షతో అధికారం చేపట్టి పాలన గాలికి వదిలేశారని అన్నారు. పట్టణములో ఏర్పడ్డ అపరిశుభ్రత,అసంపూర్తి రోడ్ల విస్తరణ,కరెంట్ స్థంబాల కొరత కొత్త కాలనీలో ఏర్పడ్డ సమస్యలతో ఒక నివేదిక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గారికి అందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,పి. రమేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్స్ లక్ష్మినారాయణ,బండారు.కృష్ణ,నాగన్న యాదవ్,కంచే.రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,ఇమ్రాన్, నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,డాక్టర్. డ్యానియాల్,సూర్యవసం.గిరి,హేమంత్ ముదిరాజ్,మంద రాము,తోట.శ్రీను.పాల్గొన్నారు. (Story : అసంపూర్తి రోడ్ల విస్తరణతో సతమతమవుతున్న ప్రజానీకం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!