అద్భుతంగా జరిగిన చిత్రకళా పోటీలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక వాసవి హైస్కూల్ లో జెస్టిస్ ఆర్ట్ అకాడమీ వారు వినుకొండ నియోజకవర్గ స్థాయిలో బాల బాలికలకు నిర్వహించిన చిత్రకళా పోటీలలో రెండు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనుపరచారు. వినుకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నెల 19 వ తేదీన వినుకొండ వాసవి హైస్కూల్ లో జరగనున్న చిత్రకళా పండుగ లో వినుకొండ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జి వి ఆంజనేయులు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేనున్నామని వజ్రగిరి జెస్టిస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పి.జె. లూకా, వాసవి హైస్కూల్ ప్రిన్సిపాల్ నాగోతు అనిల్ కుమార్, కవి కమలారామ్, కేశవసూరి మాస్టర్,జెస్టిస్ ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ బ్యూలా, పఠాన్ ఖాసిం, పిరమిడ్ రాజు షేక్ మస్తాన్వలి, తదితరులు పాల్గొన్నారు. (Story : అద్భుతంగా జరిగిన చిత్రకళా పోటీలు)