నూతన సుజుకి యాక్సెస్ వాహనం ప్రారంభం
న్యూస్ తెలుగు/ వినుకొండ : పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్డు నందుగల సుజుకి షోరూంలో నూతన సుజుకి యాక్సెస్ వాహనాన్ని స్థానిక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్. వి. రామన్ ,చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుత. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా స్టైలిష్ గా అనుగుణంగా మరియు అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా గుంటూరు సరిపుడి వారి సహకారంతో వినుకొండ యశ్వంత్ ఆటోమేటిక్ సుజుకి షోరూం శనివారం కొత్త మోడల్ ని ఆవిష్కరించటం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. నిర్వాహకులు బత్తుల. శ్రీనివాసరావు ,దంపతులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు గుమ్మ శ్రీకాంత్ రెడ్డి, మాజీ రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఆలా. శ్రీనివాస్ రావు చేతుల మీదుగా నూతన సుజుకి యాక్సెస్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ మెకానిక్ సోదరులు పాల్గొని నూతన సుజుకి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రధాన సేవకులు జాజుల. మాల్యాద్రి, రామాలయ ప్రధాన అర్చకులు రామ్మోహన్ ఆచార్యులు, దావులూరి. శ్రీనివాసరావు, సీతారామయ్య ,వీర్ల. దిబ్బయ్య ,తదితరులు పాల్గొన్నారు. (Story : నూతన సుజుకి యాక్సెస్ వాహనం ప్రారంభం)