కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన
న్యూస్ తెలుగు/ వినుకొండ : దేశవ్యాప్తంగా కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బుధవారం కార్మిక సంఘాల రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వినుకొండలోని శివయ్య స్థూపం సెంటర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షులు కొండ్రముట్ల సుభాని అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. కార్మిక చట్టాలను అమలు చేయాలని, లేబర్ కోడ్ ను రద్దు చేయాలని, కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నయా పైసా కేటాయించకుండా మోసం చేసిందని 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మికులకు ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు మాట తప్పారని అధికారంలోకి వచ్చిన కూటమి నేతలకు కార్మిక సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన అవన్నీ బుట్ట దాఖలు అయ్యాయని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునః ప్రారంభించి పెండింగ్లో ఉన్న క్లైములు వెంటనే పరిష్కరించాలని రంగ కార్మికులకు అమాలి ఆటో వీధి విక్రయదారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని లేనిపక్షంలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాయని ప్రభుత్వాన్ని బూదాల శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు షేక్ ఫిరోజ్, భాస్కర్, ప్రసాద్, రాయబారం వందనం, ఊట్ల రామారావు, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, ఎస్. కె మస్తాన్ వలి , జల్లి వెంకటేశ్వర్లు, సుబేదార్, యూనిస్, తదితర కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. (Story : కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన)