పిల్లలను అంగన్వాడి సెంటర్ కు విధిగా పంపించాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఎర్లీ చైల్డ్ హుడ్ అండ్ ఎడ్యుకేషన్ వినుకొండ మున్సిపాలిటీ నందు బి సెక్టార్ లోని శ్రీనివాస నగర్ సెంటర్ నందు ఈసీసీఈ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ శ్రీలత అధ్యక్షత వహించి మాట్లాడుతూ. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల లోపు 85% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ వయసులో సమగ్ర అభివృద్ధి పిల్లలకు జరగాలి, పిల్లలు శారీరకంగా, మానసికంగా,సామాజికంగా, మేధా పరంగా సృణాత్మకత అభివృద్ధి జరిగిన అప్పుడే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. ఈ వయసులో పిల్లలను అంగనవాడి సెంటర్స్ కి పంపించడం ద్వారా సమగ్ర అభివృద్ధి తోపాటు ఇతర సేవలు కూడా అందుతాయి మన అంగన్వాడీ సెంటర్స్ లో కూడా పిపి, పిపి2 పైవేవీ విద్యాసంస్థల తో దీటుగా విద్యా బోధన జరుగుతుంది ప్రతి నెల పిల్లలు పెరుగుదల పర్యవేక్షణ తమ అనుబంధ పోషకాహారము సేవలు ఆహార ఆరోగ్య సలహాలు సాంప్రదాయ ప్రమాణాలు సేవలు అందిస్తారు. కానీ ప్రైవేటు స్కూళ్లలో ఇతర ఏ రకమైన సేవలు అందవు కావున అందరూ ఈ వయసులో బలవంతపు విద్య కంటే ఆటపాటల ద్వారా అందించే విద్య పిల్లల్లో సమగ్ర అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. కావున అందరూ కూడా అంగనవాడి సెంటర్స్ కి పిల్లలను పంపాలని తల్లులకు తెలియజేశారు. స్కూల్ పిల్లలచే పాటలు కథలు లెటర్స్ నేమ్స్ చెప్పించారు. ఈ కార్యక్రమంలో తల్లులు బాలింతలు పాల్గొన్నారు. (Story : పిల్లలను అంగన్వాడి సెంటర్ కు విధిగా పంపించాలి)